Viral Video: బర్త్ డే పార్టీలో స్నేహితుల అత్యుత్సాహం.. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆరోజు గ్రాండ్‌గా మన బర్త్ డేని సెలబ్రెట్ చేసుకుంటాం.
పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆరోజు గ్రాండ్‌గా మన బర్త్ డేని సెలబ్రెట్ చేసుకుంటాం. అయితే కొందరి అత్యుత్సాహం కారణంగా ఒక్కోసారి ఈ బర్త్‌డే వేడుకలు దారి తప్పుతుంటాయి. ప్రాణాలమీదకు వస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ముంబయిలో చోటు చేసుకుంది. అంబర్‌నాథ్ ప్రాంతంలో ఓ పుట్టిన రోజు వేడుకల్లో ప్రమాదవశాత్తూ ఓ యువకుడి ముఖానికి మంటలు అంటుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే అంబర్‌నాథ్‌కి చెందిన 20 ఏళ్ల రాహుల్ మౌర్య ఇటీవల పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నాడు. ఇందులో భాగంగా అతని స్నేహితులు గ్రాండ్‌గా కేక్ కటింగ్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు.
ఫోమింగ్ స్ప్రే కారణంగా..
కాగా ఈ సమయంలో అతని స్నేహితులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బర్త్‌డే బాయ్ కేక్ కట్ చేస్తుండగా అతనిపై గుడ్లు, కేక్‌తో పాటు ఫొమింగ్ స్ప్రే చల్లారు. దీంతో చేతిలో వెలుగుతున్న క్యాండిల్ కారణంగా ప్రమాదవశాత్తూ ముఖానికి మంట అంటుకుంది. ఆతర్వాత భయాందోళనకు గురైన అతని స్నేహితులు మంటను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీంతో అదృష్టవశాత్తూ స్వల్పగాయాలతో బయటపడ్డాడు బర్త్ డే బాయ్. దీనిని అక్కడే ఉన్న ఒక వ్యక్తి రికార్డ్ చేశారు. ఆతర్వాత ‘జీవితాలను ప్రమాదంలో పడేసే ఇలాంటి పుట్టిన రోజులకు దూరంగా ఉండండి’ అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఆ బర్త్‌డే బాయ్‌కు ఇంకా భూమ్మీద నూకలున్నాయి’. ‘ఇలాంటి వేడుకలకు దూరంగా ఉండాలి’ అని సూచిస్తున్నారు. అదే సమయంలో పుట్టినరోజు స్నో ఫోమ్ ఉపయోగించవద్దని, ఇందులో మండే గుణాలు ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని కామెంట్లు పెడుతున్నారు.
मेहरबानी करके इस तरह का जन्मदिन ना मनाए कि अपनी जान को खतरे में डाल दें।#Ambernath #Birthday pic.twitter.com/wigzxNfPfF
— कलामुद्दीन प्रॉपर्टी डीलर! (@KalamuddinBasti) April 13, 2022
MS Dhoni: ధోనీ ఫీల్డింగ్ సెట్ చేస్తే ఇట్లుంటది మరి.. కోహ్లీని ఎలా బోల్తా కొట్టించాడో చూడండి..
Srisailam Temple: మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ.. రెండు రోజులు ఉచిత స్పర్ప దర్శనం రద్దు..