Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఇందులో మొదటిగా ఏం కనిపిస్తోంది.? మీ లక్ష్యాలను చెప్పేస్తుందోయ్!
ప్రతీ ఒక్కరిలోనూ బయట కనిపించేది ఒక ముఖం అయితే.. మరొక ముఖం మీ ఇన్నర్ మైండ్‌ను చెబుతుంది. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు..
ప్రతీ ఒక్కరిలోనూ బయట కనిపించేది ఒక ముఖం అయితే.. మరొక ముఖం మీ ఇన్నర్ మైండ్‌ను చెబుతుంది. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఆ దాగి ఉన్న వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తాయి. ఇవి మన వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు.. బలాలను, బలహీనతలను కూడా చెప్పేస్తాయని సైకాలజిస్టులు అంటుంటారు. ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఏదొక ఫోటో.. ‘అందులో ఏముందో తెలుసా’ ‘ఇందులో ఏం కనిపిస్తోందో’ చూశారా.? అంటూ పలు ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
పైన పేర్కొన్న ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో ‘The Blondie Boys Shorts’ అనే గ్రూప్ షేర్ చేసింది. ఇందులో మొదటిగా మీరేం చూస్తారో.. అది మీ లక్ష్యాలను అద్దం పడుతుంది.
మొదటిగా మీరు జలపాతాలను చూసినట్లయితే.. మీరు అందరితోనూ కలిసి ఉండాలని కోరుతుంటారని అర్ధం. అలాగే మీరు ఒంటరి సమయాన్ని కూడా ఇష్టపడుతుంటారు.
మొదటిగా తెల్లటి దుస్తులతో ఉన్న వ్యక్తులను చూసినట్లయితే.. మీరు ప్రస్తుతం జీవితంలో ఓడిపోయారని అర్ధం. మీకు ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు. అయినప్పటికీ జీవితంలో ఏదైనా సాధించాలని తపన పడుతుంటారు.