Egg Man Record: ద్యావుఢా.. ఇదేం ఫీట్ సామీ.. టోపీపై 735 గుడ్లు.. సరికొత్త రికార్డ్ సృష్టించిన ఎగ్ మ్యాన్..
Egg Man Record : గుడ్లు చాలా డెలికేట్ అని అందరికీ తెలుసు కదా.. ఒక డజను గుడ్లు పగలకుండా షాప్ నుంచి ఇంటికి తీసుకురావడమే పెద్ద కష్టం మనకి. ఎందుకంటే మధ్యలో వాటికి ఏం తగిలి పగిలిపోతాయో
Egg Man Record : గుడ్లు చాలా డెలికేట్ అని అందరికీ తెలుసు కదా.. ఒక డజను గుడ్లు పగలకుండా షాప్ నుంచి ఇంటికి తీసుకురావడమే పెద్ద కష్టం మనకి. ఎందుకంటే మధ్యలో వాటికి ఏం తగిలి పగిలిపోతాయో అని భయం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 735 గుడ్లను తల టోపీపై ఉంచుకుని, అవి పగలకుండా నడిచి అందరిచేతా ఔరా అనిపించాడు. అంతేనా.. అరుదైన తన టాలెంట్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారికంగా పోస్ట్ చేసిన దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ ఆసక్తికర ఫీట్ గురించిన విషయాలను పరిశీలిస్తే.. పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే వ్యక్తి ‘ఎగ్ మ్యాన్’గా అందరికీ సుపరిచితుడు. అయితే, ఎగ్ మ్యాన్‌గా పిలవబడటానికి ఒక పెద్ద హిస్టరీనే ఉంది. ప్రపంచమంతా తిరిగి పలు దేశాల్లో తన ట్యాలెంట్‌ను ప్రదర్శించాడు గ్రెగరీ. అంతేకాకుండా కొన్ని టెలివిజన్ షోలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. దీనితో అతడు వరల్డ్ ఫేమస్ ఎగ్‌మ్యాన్‌గా అందరికీ గుర్తుండిపోయాడు. కాగా ఇప్పడు మనం చూస్తున్న ఈ వీడియోలో ఇతను ధరించిన టోపీపై గుడ్లన్నింటినీ అతికించడానికి మూడు రోజుల టైం పట్టిందట. చైనాలో సీసీటీవీ ఛానెల్ నిర్వహించిన గిన్నీస్ వరల్డ్ రికార్డు స్పెషల్ షోలో దీనిని తలపై పెట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ ప్రదర్శించాడు గ్రెగరీ. దీనిని చూసిన గిన్నీస్ రికార్డు అధికారులు సైతం షాక్ అయ్యారు. అతని ఫీట్‌కు ‘వావ్’అనకుండా ఉండలేకపోయారు. ఇలా ప్రపంచంలోనే అత్యధిక గుడ్లు సింగిల్ టోపీపై ధరించిన మొదటి వ్యక్తిగా గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు గ్రెగరి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ కామెంట్లతో గ్రెగరీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. వేల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. హ్యాట్సాఫ్ టూ యూ గ్రెగరీ అంటూ కితాబిస్తున్నారు.
Video:
View this post on Instagram
Also read:
Water in Theater: శివగంగ థియేటర్‌లో పొంగిన గంగ.. వైరల్ అవుతున్న వీడియో..
ప్రేమంటే ఇదే మరి.. పెంపుడు కుక్కకు శ్రీమంతం.. అదుర్స్ అంటున్న జనాలు..
TRS – KTR: వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన.. భారీగా తరలిరావాలన్న మంత్రి కేటీఆర్..