Viral Video: నడి రోడ్డుపై చిందులు వేసిన యువతి.. డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుందీ. కానీ వారు మాత్రం..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Sep 15, 2021 | 8:46 PM

Viral Video: ఇప్పుడు ఎక్కడా చూసినా.? ఎక్కడ విన్నా.? వైరల్‌ అనే మాట బాగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచీ...

Viral Video: నడి రోడ్డుపై చిందులు వేసిన యువతి.. డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుందీ. కానీ వారు మాత్రం..
Follow us

Viral Video: ఇప్పుడు ఎక్కడా చూసినా.? ఎక్కడ విన్నా.? వైరల్‌ అనే మాట బాగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచీ ఈ ట్రెండింగ్‌ గోల ఎక్కువైంది. దీంతో చాలా మంది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో రకరకాల చాలెంజ్‌లు పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలెంజ్‌లను విసురుతున్నారు. సదరు చాలెంజ్‌లను స్వీకరించిన తర్వాత వాటికి సంబంధించిన వీడియోలను మళ్లీ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడం ఇటీవల ఓ ట్రెండ్‌లా మారిపోయింది. తాజాగా ఇలాంటి ఓ చాలెంజ్‌కు సంబంధించిన వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే ఇండోర్‌కు చెందిన శ్రేయా అనే ఓ యువతికి సోషల్‌ మీడియాలో ‘పబ్లిక్‌ ప్లేస్‌’లో డ్యాన్స్‌ చేయాలనే చాలెంజ్‌ విసిరారు. దీంతో ఆ చాలెంజ్‌ను స్వీకరించిన యువతి ఇండోర్ పట్టణంలోని రసోమా స్క్వేర్‌లో శ్రేయా రద్దీగా ఉండే రోడ్డు మీద డ్యాన్స్‌ చేసింది. రెడ్‌ సిగ్నల్‌ పడటంతో హఠాత్తుగా రోడ్డు మీదకొచ్చి, ముఖానికి మాస్క్‌ వేసుకొని స్టెప్పులేసింది.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఆ యువతి.. ‘దయచేసి నిబంధనలను అతిక్రమించకండి. రెడ్‌ సిగ్నల్‌ పడింది కాబట్టే ఆగిపోయారు, నేను డ్యాన్స్‌ చేస్తున్నందుకు కాదు. అలాగే నేను మాస్క్‌ కూడా ధరించాను’ అంటూ తన తప్పేమి లేదన్నట్లు క్యాప్షన్‌ జోడించింది. అయితే ఆ యువతి అంతలా వివరణ ఇచ్చినప్పటికీ.. పోలీసులు మాత్రం ఆగ్రహించారు. ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించినందుకుగాను ఆమెకు నోటీసులు జారీచేశారు.

View this post on Instagram

A post shared by Shreya Kalra (@shreyakalraa)

Also Read: Viral Pic: ఈ ఫోటోలోని చిన్నారి చాలా ఫేమస్.. ఇప్పుడొక హీరోయిన్.. కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్..

Viral Video: పులిని ఫోటో తీయాలనుకుని.. డేంజర్‌లో పడిన టూరిస్టులు.. చివరికి ఏమైందంటే.!

Online Food Services: ఇంటి వంట కాదని బయట రుచులకు అలవాటుపడ్డ భోజన ప్రియులకు షాకింగ్ న్యూస్..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu