Online Food Services: ఇంటి వంట కాదని బయట రుచులకు అలవాటుపడ్డ భోజన ప్రియులకు షాకింగ్ న్యూస్..!

GST on Online Food Services: ఫుడ్‌ డెలివరీ ఫ్లాట్‌ఫామ్స్‌ జోమాటో, స్విగ్గీ తమ సేవలను త్వరలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కిందకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Online Food Services: ఇంటి వంట కాదని బయట రుచులకు అలవాటుపడ్డ భోజన ప్రియులకు షాకింగ్ న్యూస్..!
Gst On Online Food Services

GST on Online Food Services: ఇంటి వంట కాదని వివిధ బయట రుచులకు అలవాటుపడి, ఆన్‌లైన్‌లో తరచూ ఆర్డర్‌ చేసే ఆహార ప్రియులకు ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. ఫుడ్‌ డెలివరీ ఫ్లాట్‌ఫామ్స్‌ జోమాటో, స్విగ్గీ తమ సేవలను త్వరలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కిందకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం జరిగే జీఎస్‌టీ సమావేశాల్లో ఈ ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారన్నట్లు తెలుస్తోంది. జీఎస్‌టీ కౌన్సిల్‌లోని ఫిట్‌మెంట్‌ కమిటీ ఇచ్చిన సూచనలపై సమావేశాల్లో చర్చించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

దేశవ్యాప్తంగా ఒకే తరహా పన్నులు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ – GST)ను అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వేర్వేరు ట్యాక్సులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. వేర్వేరు పన్నులకు బదులు జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్, మద్యం వంటి కొన్నింటిని మినహాయిస్తే.. మిగిలినవన్నీ జీఎస్టీ పరిధిలో కొనసాగుతున్నాయి. తాజాగా ఈ పరిధిలో ఫుడ్‌ డెలివరీ ఫ్లాట్‌ఫామ్స్‌ను కూడా చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచ్చిస్తున్నట్లు సమాచారం. రెస్టారెంట్లు అందించే సేవలతో పాటు డోర్‌ డెలీవరీ, టేక్‌అవే, ఫుడ్‌ సర్వ్‌ చేయడం వంటి వాటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని కమిటీ సూచించింది. దీనిపై కమిటీ రెండు ప్రతిపాదనలు తీసుకువచ్చింది.

మన దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అతిపెద్ద సంస్కరణగా చెప్పవచ్చు. పలు రకాల పన్నులను (సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, సర్ చార్జీలు, రాష్ర్ట స్థాయిలో వ్యాట్, ఆక్ర్టాయ్ వంటివి) విలీనం చేసి జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. ఈ జీఎస్టీ విధానం మన దేశంలో 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాలు విధించే పలు రకాల పన్నుల స్థానంలో జీఎస్టీ విధిస్తున్నారు. వస్తుసేవలపై శ్లాబుల వారీగా పన్నును విధించడం జీఎస్టీతో మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ద్వారా ఇంటికి ఫుడ్ తెచ్చుకుంటే, ఇకపై వస్తు సేవల రూపంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

మొదటి ప్రతిపాదనలో భాగంగా యాప్‌ ఆధారిత ఈ-కామర్స్‌ ఆపరేటర్ల (ECO)ను ‘డీమ్డ్‌ సప్లయర్స్’గా గుర్తిస్తూ రెండు కేటగిరీలుగా విభజించింది. ఇన్‌పుట్ క్రెడిట్ లేకుండా 5 శాతం, ఇన్‌పుట్ క్రెడిట్‌తో 18 శాతం పన్ను రేటుతో రెస్టారెంట్‌ నుంచి ECOకు పన్ను విధించడం. ECO నుంచి కస్టమర్‌కు 5 శాతం పరిమిత ఇన్‌పుట్ పన్ను క్రెడిట్‌ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ ఫ్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రెండో ప్రతిపాదనలో ECOలను అగ్రిగేటర్లుగా గుర్తించి తర్వాత రేట్‌ను ఫిక్స్‌ చేయడం. దీనివల్ల రెస్టారెంట్‌ అందించే అన్ని సేవలకు ECOలే జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ పన్ను విధానం రూ.7,500 కంటే ఎక్కువ టారిఫ్‌లు ఉన్న హోటళ్లకు, రెస్టారెంట్లకు వర్తించకపోవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ప్రతిపాదనలతో సామాన్యులకు కొంత వరకు భారం పడే అవకాశముందని తెలుస్తుంది.

 Read Also….  WHO: ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా కొత్త కేసులు.. అయినా జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ!

Click on your DTH Provider to Add TV9 Telugu