Viral Video: పులిని ఫోటో తీయాలనుకుని.. డేంజర్‌లో పడిన టూరిస్టులు.. చివరికి ఏమైందంటే.!
Tiger Attack Video: ''పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో.. చూసుకో.. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు''..
”పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో.. చూసుకో.. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు” అంటూ యమదొంగ మూవీలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తుండొచ్చు. పులితో ఆటలు ఆడటం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. సరిగ్గా ఇలాగే కొంతమంది టూరిస్టులు పులితో గేమ్స్ ఆడాలనుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వాళ్లు పులితో ఫోటో దిగాలనుకున్న ప్లాన్ కాస్తా బెడిసికొట్టి.. చివరికి వాళ్లే డేంజర్‌లో పడ్డారు. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి..
జంగిల్ సఫారీకి సంబంధించిన అనేక వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు.. ఆ టూరిస్టులు చేసిన తెలివితక్కువ పనిని విమర్శిస్తున్నారు. వైరల్ వీడియో ప్రకారం.. పులి తన మార్గంలో ఎంచక్కా సేద తీరుతూ హాయిగా వస్తోంది. దాని ఎదురుగా టూరిస్టులతో నిండిన ఓ జీపు ఉన్నట్లు మీరు చూడవచ్చు. అందులోని టూరిస్టులు దాన్ని ఫోటోలు తీస్తున్నారు.
ఎంతలా ఫోటోలు తీస్తూ మైమరిచిపోయారంటే.. పులి వారిని సమీపిస్తోందన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. వారి దగ్గరకు పులి రావడం.. అది బెదరగొట్టడం కూడా జరిగిపోయింది. అయినప్పటికీ ఆ టూరిస్టులు తమ జీపును వెనక్కి తీయకపోవడంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ప్రమాదాలు కొనితెచ్చుకోవడం అంటే ఇదే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను ”WildLense_India” అనే ట్విట్టర్ పేజ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఇది వైల్డ్ లైఫ్ టూరిజం కాదు, పులిని ఈ విధంగా వేధించడం అనైతికమైనది అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి చేష్టలు కారణంగా ప్రమాదాలు జరుగుతాయని అంటున్నారు.
Please watch this clip and share your views. For us this is not wildlife tourism, disturbing big cat to the limit of his gentleness is unethical. Mobile, Untrained drivers & guides are as bad as government.@rameshpandeyifs @ParveenKaswan @Saket_Badola @susantananda3 @surenmehra pic.twitter.com/LrDUQbHaCR
— WildLense® Eco Foundation ?? (@WildLense_India) September 14, 2021
Read Also:
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్
కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్