Viral Video: ఇది చూశారా.. డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన హెల్దీ జ్యువెలరీ!
హెడ్డింగ్ చూసి ఖంగు తిన్నారా.. హెల్దీ జ్యువెలరీ ఏంటి? అని ఆశ్చర్య పోతున్నారా.. ఇప్పుడు నగల్లో కూడా ఆరోగ్యంగా ఉండేవి వచ్చేస్తున్నాయి. అవునా అదేంటి? అనుకుంటున్నారా. ఈ వీడియో చూశారంటే నిజంగానే ఔరా అంటారు. నగలంటే ఇష్టముండని లేడీస్ ఎవరూ ఉండరు. ఎన్ని నగలు ఉన్నా.. ఇంకా ఏదో ఒకటి కొనాలి.. వేసుకోవాలి అని అనుకుంటారు. బంగారం అంటే అంత పిచ్చి లేడీస్‌కి. అందులోనూ ఏదైనా ఫంక్షన్ ఉందంటే.. ఒంటి నిండా అలంకరించుకుని వెళ్తూ..

హెడ్డింగ్ చూసి ఖంగు తిన్నారా.. హెల్దీ జ్యువెలరీ ఏంటి? అని ఆశ్చర్య పోతున్నారా.. ఇప్పుడు నగల్లో కూడా ఆరోగ్యంగా ఉండేవి వచ్చేస్తున్నాయి. అవునా అదేంటి? అనుకుంటున్నారా. ఈ వీడియో చూశారంటే నిజంగానే ఔరా అంటారు. నగలంటే ఇష్టముండని లేడీస్ ఎవరూ ఉండరు. ఎన్ని నగలు ఉన్నా.. ఇంకా ఏదో ఒకటి కొనాలి.. వేసుకోవాలి అని అనుకుంటారు. బంగారం అంటే అంత పిచ్చి లేడీస్‌కి. అందులోనూ ఏదైనా ఫంక్షన్ ఉందంటే.. ఒంటి నిండా అలంకరించుకుని వెళ్తూ ఉంటారు. మరికొందరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలని.. కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. ఫంక్షన్లు అనగానే ఖరీదైన నగలు ధరించడం ఆడవాళ్ల ప్రత్యేకత. కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తే.. అందరూ నోరెళ్ల బెడతారు. ఇలా కూడా చేస్తారా? అని షాక్ అవుతారు. మరి ఈ హెల్దీ నగల గోల ఏంటో ఇప్పుడు చూసేద్దామా.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో ఓ మహిళకు సీమంతం ఫంక్షన్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. అందరిలాగే ఆ మహిళ కూడా నగలు ధరించింది. అయితే అది బంగారం కాదు.. మెటల్‌వి కూడా కాదు. డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన హెల్దీ నగలు. నిజంగానే షాక్ అయ్యారు కదా. పట్టు చీరను కట్టుకున్న ఆ మహిళ.. ఒంటి నిండా డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన నగలు ధరించింది.
ఇప్పటి వరకూ మీరు ఎన్నో రకాల నగలను.. డిజైన్లను చూసి ఉంటారు. ఇండో వెస్ట్రన్ లుక్‌పై కూడా ఓ లుక్ వేసే ఉంటారు. కానీ ఈ డ్రై ఫ్రూట్స్ నగలను మాత్రం చూసి ఉండరు. కానీ ఇది చూడటానికి నిజంగానే అద్భుతం అన్న రేంజ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నగలు కూడా ట్రెండ్ కానున్నాయోమో.. చూడాలి. ఈ వీడియో.. ఎక్కడి వరకూ తీసుకెళ్తుందేమో. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ వీడియో చూసేయండి.
View this post on Instagram
