Cockroach in Noodles: నూడిల్స్ సూప్‌లో చచ్చిన బొద్దింకను చూసి షాక్ అయిన మహిళ.
ఫుడ్ డెలివరీ అప్లికేషన్ల వినియోగం నేటి కాలంలో గణనీయంగా పెరిగింది. సమయాన్ని ఆదా చేయడంతోపాటు నచ్చిన ఆహారాన్ని నిమిషాల్లో కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. అయితే, ఇలా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల నాణ్యతపై అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తోంది. ఇప్పటికే పలుమార్లు రెస్టారెంట్ల నుంచి వచ్చిన ఫుడ్ ఆర్డర్‌లలో పురుగులు వచ్చాయంటూ పలువురు ఫిర్యాదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఫుడ్ డెలివరీ అప్లికేషన్ల వినియోగం నేటి కాలంలో గణనీయంగా పెరిగింది. సమయాన్ని ఆదా చేయడంతోపాటు నచ్చిన ఆహారాన్ని నిమిషాల్లో కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. అయితే, ఇలా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల నాణ్యతపై అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తోంది. ఇప్పటికే పలుమార్లు రెస్టారెంట్ల నుంచి వచ్చిన ఫుడ్ ఆర్డర్‌లలో పురుగులు వచ్చాయంటూ పలువురు ఫిర్యాదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా అలాంటి మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ ఆధారిత రెస్టారెంట్ నుంచి బుధవారం జొమాటో ద్వారా ఆర్డర్ చేసిన నూడిల్స్‌లో చచ్చిన బొద్దింక కనిపించిందంటూ ఓ కస్టమర్ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఎక్స్‌లో వైరల్‌గా మారింది.
సోనై ఆచార్య అనే యూజర్ ‘ఆంటీ ఫగ్స్’ అనే రెస్టారెంట్ నుంచి జపనీస్ రామెన్ ఫుడ్‌ను జొమాటోలో ఆర్డర్ చేసింది. తనకు అందిన నూడిల్ సూప్‌లో చనిపోయిన బొద్దింక కనిపించిందని ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇది ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు. అసహ్యంగా ఉంది. ఇక్కడ ఫుడ్ నాణ్యత తీవ్రంగా నిరాశ పరిచింది’ అంటూ తన పోస్టులో తెలిపింది. మహిళ ఫిర్యాదుపై జొమాటో వెంటనే స్పందించింది. దురదృష్టకరమైన ఈ సంఘటనపై చింతిస్తున్నామని, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునేందుకు దయచేసి కొంత సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై జొమాటో వీలైనంత త్వరలో సదరు కస్టమర్‌ను సంప్రదిస్తామని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా మిస్ ఆచార్య షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో ఫుడ్ డెలివరీ కంపెనీ ఆర్డర్ కోసం చెల్లించిన రూ.320 రీఫండ్ చేసినట్లు పేర్కొంది. తరచూ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై ఇలాంటి ఫిర్యాదులు రావడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

