Telugu News Trending A video of two fish kissing like human beings in an aquarium has gone viral on social media Telugu News
Video Viral: వాటిని కాసేపు ఒంటరిగా వదిలేయండి డ్యూడ్.. రొమాన్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కవగా వైరల్ అవుతుంటాయి...
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కవగా వైరల్ అవుతుంటాయి. నీటిలో నివసించే చేపలు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. రంగురంగుల చేపలను కొందరు అక్వేరియాల్లో పెంచుకుంటుంటారు. ఇవి మనసుకు ప్రశాంతతనే కాకుండా అదనపు ఆకర్షణను తీసుకువస్తాయి. అయితే వీటిలో కొన్ని చేపలు అవి చేసే పనులతోనూ నవ్వు తెప్పిస్తాయి. కొన్ని సార్లు అవి చేసే పనులు చూస్తే నిజంగా ముక్కున వేలేయాల్సిందే. ప్రేమ.. అనేది విశ్వవ్యాప్తం. ప్రపంచవ్యాప్తంగా ప్రేమ వివిధ రూపాల్లో దాగి ఉంది. అయితే ఇది మనుషుల మధ్యే కాకుండా జీవజాతుల మధ్య కూడా ఉంటుందని ఈ వీడియో నిరూపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఈ క్లిప్ లో ఓ అక్వేరియంలో రెండు చేపలు నివాముంటున్నాయి. అవి నీటిలో అటూ ఇటూ ఈదుతూ ఒక దగ్గరికి చేరుకున్నాయి. అంతటితో ఆగకుండా ఒకదానికొకటి పరస్పరం ముద్దు పెట్టుకున్నాయి. అవునండీ.. మీరు చదివింది పూర్తిగా నిజమే. అచ్చం మనుషులు కిస్ చేసుకున్నట్లుగా ఒకదానికొకటి పెదవులపై ముద్దు పెట్టుకోవడాన్ని చూడవచ్చు.
ఈ అందమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో Naturelife_ok అనే ఖాతాతో పోస్ట్ అయింది. సోషల్ మీడియాలో అప్ లోడ్ అయిన కొద్ది సమయంలోనే ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు దాదాపు 23 వేల మంది వీడియోను లైక్ చేశారు. ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఓ అద్భుతం! చేపలు కూడా రొమాన్స్ చేస్తున్నాయని, ఇది నిజంగా చాలా అందమైన వీడియో అని వ్యాఖ్యానిస్తున్నారు.