Viral Video: వామ్మో.. అంత పెద్ద పక్షిని వేటాడిన సాలీడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..
తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో ఓ పెద్ద పక్షి చిక్కుకుంది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
మన ఇళ్లలో.. లేదా చెట్టు కొమ్మలకు సాలీడు వలలు అల్లడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఆ వలలను మనం చేతితో టచ్ చేస్తుంటారు. కానీ సాలీడు అంత పెద్దగా వలను అల్లడం వెనక పెద్ద విషయమే ఉంది. ఆ వల ద్వారా అనేక కీటకాలను చంపి తినేస్తుంటుంది. ఈగలు, చిన్న చిన్న కీటకాలు ఆ వలలో చిక్కుకోవడం జరుగుతుంది. ఇటీవల ఓ సాలీడు వలలో చిక్కుకున్న పామును స్పైడర్ చంపేసిన వీడియో చూసి ఉంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో ఓ పెద్ద పక్షి చిక్కుకుంది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
ఆ వీడియోలో.. ఒక హమ్మింగ్ పక్షి సాలీడు వలలో చిక్కుకుంది. అయితే ఆ పక్షి ఆ వల నుంచి బయటపడేందుకు తెగ ట్రై చేస్తుంది. కానీ ఆ వల గట్టిగా ఉండడంతో అది బయటకు రాలేకపోయింది. దీంతో అక్కడే ఉన్న ఒక చిన్న సాలీడు కూడా దాని వైపు వేగంగా వస్తున్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.