AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్స్‌పర్ట్ ఈ పడవ బాబాయ్.. ఫోజులు చూడండి ఎలా చెబుతున్నాడో

ఓ కపుల్ ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్​ను డిఫరెంట్​గా చేసుకోవాలనుకునే ఉద్దేశంతో.. చిన్నపాటి నదిని లొకేషన్​గా ఎంచుకుంది. అక్కడ వారికి ఒక ఫన్నీ ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది. అదేంటో మరి ఓసారి మీరూ చూసేయండి.

Viral: ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్స్‌పర్ట్ ఈ పడవ బాబాయ్.. ఫోజులు చూడండి ఎలా చెబుతున్నాడో
Viral Pre Wedding Shoot
Ram Naramaneni
|

Updated on: Jan 23, 2023 | 8:39 AM

Share

ఇప్పడు ప్రీ వెడ్డింగ్ షూట్.. సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే కదా… ! కొందరు వీటిల్లో కూడా శృతిమించి ఓవరాక్షన్ చేస్తున్నారు. పైత్యం ప్రదర్శించి నవ్వులు పాలువుతున్నారు. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ తమ క్రియేటివిటీ వాడుతూ ప్రీ వెడ్డింగ్ షూట్స్‌లో చెలరేగిపోతున్నారు. వారందర్నీ పక్కనబెడితే..  ఇప్పుడు మీకు ఒక పడవ బాబాయ్‌ని పరిచయం చేయాలి. ఈయన ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్స్‌పర్ట్. నాటు పడవ నడుపుతూ ఉంటాడు. అయితే ఈ మధ్యకాలంలో నదిలో ప్రి వెడ్డింగ్ షూట్స్ కోసం ఆయన పడవను అద్దెకు తీసుకుంటున్నారు. అంటే నదిలోకి తీసుకెళ్లడానికి ఆయన కూడా ఉండాలి. ఈ క్రమంలో చూసి.. చూసి ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎలా చేయాలో ఆయనకు కూడా అర్థమైంది.

తాజాగా ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో ఫోటోగ్రాఫర్స్‌ను మించి ఆ బాబాయ్ చెలరేగిపోయాడు. నదిలో పడవలో ఉండి ఆ కాబోయే జంటతో ఫోజులు పెట్టించాడు. మధ్యలో నా మాట వినండి అంటూ కాస్త గద్దించాడు కూడా. ఆ జంట కూడా ఆయన మాట విని.. ఫోజులిచ్చారు. మరోవైపు కెమెరామెన్ ఇదంతా చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ పెద్దాయన ఫన్నీ ఫోజుల్ని కెమెరాలో బంధించాడు. అక్కడున్నవారు నవ్వడం కూడా ఈ వీడియో కనిపించింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు ” ఎవరు బాబాయ్ నువ్వు ఇంత టాలెంటేడ్​లా ఉన్నావు” అని..  ” ఇదిగో పెద్దాయన.. నువ్వు ఆ జాబ్ మానేసి ఫోటోగ్రాఫర్ అయిపో” అని  తెగ కామెంట్స్​ చేస్తున్నారు. ఆ బాబాయ్ జంటకు ఫొటో పోజులు వర్ణించిన తీరు.. ఎలా నవ్వులు తెప్పించిందో మీరూ ఓ లుక్కేయండి..  వీలైతే మీ ప్రీ వెడ్డింగ్ షూటింగ్‌కు మీరు కూడా ఆయన దగ్గరికే వెళ్లండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..