Sanjay Dutt: చనిపోతాను కానీ చికిత్స చేయించుకోనని చెప్పా..! ఆ విషయం గుర్తుచేసుకున్న సంజూభాయ్..
వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సంజయ్‌దత్ ‘కేజీయఫ్2' తో దక్షిణాది వారికీ దగ్గరయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజయ్‌దత్ మాట్లాడుతూ గతాన్ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు.
‘‘ఒక రోజు నాకు తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది. ఎంతసేపటికి నొప్పి తగ్గకపోవడంతో ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ కొన్ని టెస్ట్‌లు చేశాక నాకు క్యాన్సర్ అని తెలిసింది. ఆ సమయంలో నా భార్య, నా కుటుంబ సభ్యులు ఎవ్వరూ అందుబాటులో లేరు. విషయం తెలియగానే నా సోదరి హాస్పిటల్‌కు వచ్చింది. మా కుటుంబంలో క్యాన్సర్ బారిన పడడం కొత్తేమీ కాదు. మా కుటుంబంలో ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు చనిపోయారు. నాకు క్యాన్సర్ వచ్చిందని డాక్టర్ చెప్పినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. కీమోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. చనిపోవాలని రాసి ఉంటే చనిపోతా.. కానీ నేను చికిత్స మాత్రం చేయించుకోను. నాకు ఎలాంటి చికిత్స అవసరం లేదని నా సోదరితో చెప్పా’’ అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు చికిత్స తీసుకున్న సంజయ్.. మనోధైర్యంతో క్యాన్సర్‌ను జయించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

