Video Viral: నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటది మరి.. స్టంట్ చేయబోయి.. స్టన్న్ అయిపోయాడు..
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఏదో విధంగా ఫేమస్ అవ్వాలనే కారణంతో కొందరు చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. కొన్ని సార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా చలి...
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఏదో విధంగా ఫేమస్ అవ్వాలనే కారణంతో కొందరు చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. కొన్ని సార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జనాలు జంకుతున్నారు. చలి మంట కాచుకోవడం, హీటర్లు వాడటం, స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు ధరించడం వంటి ఉపశమన చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. చలి మంట వేసుకోవడం చలికాలంలో చాలా కామన్. చలి మంట చూట్టూ కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ.. చలి కాచుకుంటే వచ్చే థ్రిల్లే వేరు. అయితే.. ఓ యువకుడు చేసిన పని అతని ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్టంట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దీని కోసం చాలా సాధన చేయాలి. ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాతే ప్రజలను ఆకట్టుకునేలా స్టంట్స్ చేయవచ్చు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి.. నిప్పుతో స్టంట్స్ చేస్తాడు. విపరీతమైన చలి కారణంగా చలి కాచుకునేందుకు కొందరు యువకులు మంట వేసుకున్నారు. కొంత సమయం తర్వాత.. ఓ యువకుడు మంటల మీద అటు వైపు నుంచి ఇటు, ఇటు వైపు నుంచి అటు దూకాడు. ఈ క్రమంలో యువకుడి దుస్తులకు మంటలు అంటుకున్నాయి. మంటల ధాటికి తాళలేక యువకుడు పరుగులు తీయడం వీడియోలో కనిపించింది.
La danza del fuego pic.twitter.com/43jLTWSkKp
— Profesor Caos (@ProfesorCaos5) January 10, 2023
వైరల్ అవుతున్న వీడియో ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ అయింది. దీంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..