Viral Video: కెమెరా కంటికి చిక్కిన అరుదైన పులి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. మీరూ ఓ లుక్కేయండి..

Viral Video: ప్రకృతి గురించి మనకు తెలిసింది గోరంత అయితే తెలియాల్సింది కొండంతా అని చెబుతుంటారు. ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు మన భూగ్రహం. అరుదైన చెట్లు, జంతువులు...

Viral Video: కెమెరా కంటికి చిక్కిన అరుదైన పులి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. మీరూ ఓ లుక్కేయండి..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 01, 2022 | 5:05 PM

Viral Video: ప్రకృతి గురించి మనకు తెలిసింది గోరంత అయితే తెలియాల్సింది కొండంతా అని చెబుతుంటారు. ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు మన భూగ్రహం. అరుదైన చెట్లు, జంతువులు నిత్యం ఎక్కడో ఒక దగ్గర తారసపడుతూనే ఉంటాయి. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి అరుదైన జంతువులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి, క్షణాల్లో ప్రపంచమంతా చుట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ అరుదైన పులికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

వివరాల్లో వెళితే.. ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్‌ రిజర్వ్‌లో ఓ నల్ల పులి కెమెరా కంటికి చిక్కింది. పూర్తిగా నల్లగా ఉన్న ఈ అరుదైన పులికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ సుశాంత నందా ట్వీట్‌ చేశారు. వీడియోతో పాటు.. ‘భారత దేశ అడువుల సుస్థితరకు పులులు చిహ్నం. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అరుదైన మెలనిస్టిక్‌ టైగర్‌ వీడియోను షేర్‌ చేస్తున్నాను’ అనే క్యాప్షన్‌ రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఈ మెలనిస్టిక్‌ పులులు ఇలా నల్లగా ఉండడానికి రెండు విభిన్న జాతుల పులు కలయిక వల్లే అని నిపుణులు చెబుతున్నారు. మ్యుటేషన్‌ వల్లే ఈ పులులు ఇలాంటి రంగులో ఉంటాయని సమాచారం. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో ఇలాంటి పులు ఇంకా ఉన్నట్లు నిరూపితమైంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..