AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 27 ఏళ్ల క్రితం చోరీ..వేషాలు మార్చి మరీ పట్టుకున్న పోలీసులు.. చివరికి ఊహించని ట్విస్ట్..

27 ఏళ్ల క్రితం జరిగిన ఓ దొంగతనం కేసులో దొంగని తాజాగా పోలీసులు పట్టుకున్నారు. 27 ఏళ్ల క్రితం జరిగిన ఈ దొంగతనం గూర్చి కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ దొంగతనంలో అమౌంట్ ఎంతో తెలిస్తే ఎవరైనా నోరు వెళ్ళబెట్టాల్సిందే..

Viral News: 27 ఏళ్ల క్రితం చోరీ..వేషాలు మార్చి మరీ పట్టుకున్న పోలీసులు.. చివరికి ఊహించని ట్విస్ట్..
A Man Arrested After 27 Years For Stealing 60 Rupees In Tamilnadu
Follow us
Ch Murali

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 12, 2024 | 8:06 PM

సాధారణంగా దొంగతనం జరిగితే పోలీసులు దొంగను పట్టుకునేందుకు పది నుంచి నెల రోజుల లోపల పట్టుకోవడం మనం చూసి ఉంటాం. అయితే 27 ఏళ్ల క్రితం జరిగిన ఓ దొంగతనం కేసులో దొంగని తాజాగా పోలీసులు పట్టుకున్నారు. 27 ఏళ్ల క్రితం జరిగిన ఈ  దొంగతనం గూర్చి కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.  27 ఏళ్ల క్రితం జరిగిన దొంగతనంలో అమౌంట్ ఎంతో తెలిస్తే ఎవరైనా నోరు వెళ్ళబెట్టాల్సిందే.. కేవలం రూ. 60 రూపాయలు దొంగలించిన ఓ దొంగను 27 ఏళ్ల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. ఆ దొంగను పట్టుకోవడానికి  పోలీసులు వేషాలు మార్చి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని శివకాశిలో చోటు చేసుకుంది.

తమిళనాడు రాష్ట్రంలోని మధురై ప్రాంతంలోని తెప్పకులం అనే పీఎస్ పరిధిలో  27 ఏళ్ల క్రితం జరిగిన ఓ దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 1997లో బాధితుడి నుంచి పన్నీరు సెల్వం అనే వ్యక్తి రూ.60 దోచుకుని పారిపోయాడు. ఈ మేరకు భాదితుడు పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో తెప్ప కులం పీఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించే పనిలో పడిన పోలీసులు 1997లో జరిగిన ఈ చోరీ కేసును గుర్తించారు.

దీంతో అసిస్టెంట్ కమిషనర్ సూర్యకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అందులో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్  బృందంతో కలిపి నిందితుడిని పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో పన్నీరు సెల్వం ఉన్న ఊరైన జక్క తోపుకు ప్రత్యేక బృందం వెళ్ళింది. అక్కడ సెల్వం గురించి ఆరా తీసినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. అయితే ప్రత్యేక బృందం మరో ప్లాన్ తో ముందుకు వెళ్ళింది. మరోసారి జక్క తోపుకు వెళ్లిన బృందం ఈ సారి జనాభా లెక్కల అధికారులుగా గ్రామంలోకి వెళ్లడంతో పన్నీరు సెల్వం ఆచూకీ గుర్తించారు. గతంలో జక్క తోపులో ఉన్న పన్నీరు సెల్వం  పెళ్లి చేసుకుని శివ కాశీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో శివ కాశీ వెళ్లి పన్నీరు సెల్వంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..