భార్యకు గర్భం రాకూడదని ఓ చిన్నారిని నరబలి ఇచ్చిన భర్త

సాంకేతిక రంగంలో రోజురోజుకు మార్పులు వస్తున్నప్పటికీ ఇంకా కొందరు మూఢనమ్మకాల్లోనే కూరుకుపోయారు. స్వాములు, బాబాలు, మంత్రగాల్లు చెప్పిన మాటలు వింటూ మోసపోతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో జరిగింది.

భార్యకు గర్భం రాకూడదని ఓ చిన్నారిని నరబలి ఇచ్చిన భర్త
Crime
Follow us

|

Updated on: Mar 27, 2023 | 9:24 PM

సాంకేతిక రంగంలో రోజురోజుకు మార్పులు వస్తున్నప్పటికీ ఇంకా కొందరు మూఢనమ్మకాల్లోనే కూరుకుపోయారు. స్వాములు, బాబాలు, మంత్రగాల్లు చెప్పిన మాటలు వింటూ మోసపోతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే బీహార్ కు చెందిన అలోక్ కుమార్ అనే వ్యక్తి కోల్ కతాలోని టిల్జాలా ప్రాంతంతో తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అయితే అతని భార్యకు మూడుసార్లు గర్భస్రావమైంది. ఇటీవల మళ్లీ ఆమెకు గర్భం వచ్చింది. అయితే అలోక్ కుమార్ తన భార్యకు మరోసారి గర్భస్రావం రాకుండా చేయాలని నిశ్చయించుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాక చివరికి ఓ మంత్రగాడిని కలిశాడు.

అయితే ఆ మంత్రగాడు ఓ చిన్నారిని నరబలి ఇస్తే నీ భార్యకు గర్భం రాకుండా ఆగుతుందని చెప్పాడు. దీంతో తన భార్య గర్భం నిలవడం కోసం అలోక్ కుమార్ ఎలాగైనా నరబలి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. తన పొరిగింటిలో ఉన్న పాపను నరబలి ఇచ్చాడు. బిల్డింగ్ లో రక్తపు మడుగులో ఉన్న బాలికను చూసి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. నరబలి పేరుతో తమ బిడ్డను హత్య చేశారంటూ నిరసనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని అలోక్ కుమార్ ను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..