AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్టేడియంలో కుర్చీలకు కలర్ వేస్తున్న ధోనీ.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

మహేంద్రసింగ్‌ ధోనీ పెయింటర్‌గా మారాడు. చెన్నై చెపాక్‌ స్టేడియంలో కుర్చీలకు కలర్స్‌ వేస్తూ వీడియోకి చిక్కాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఐపీఎల్‌ సీజన్‌ 16 మరో మూడ్రోజుల్లో మొదలుకాబోతోంది. మార్చి 31నుంచి ప్రారంభంకాబోతున్న ఐపీఎల్‌ కోసం ఆటగాళ్లంతా రెడీ అవుతున్నారు. తమతమ ఫ్రాంచైజీలకు చేరుకొని క్యాంపుల్లో సాధన చేస్తున్నారు.

Viral Video: స్టేడియంలో కుర్చీలకు కలర్ వేస్తున్న ధోనీ.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
Ms Dhoni
Shiva Prajapati
|

Updated on: Mar 28, 2023 | 6:10 AM

Share

మహేంద్రసింగ్‌ ధోనీ పెయింటర్‌గా మారాడు. చెన్నై చెపాక్‌ స్టేడియంలో కుర్చీలకు కలర్స్‌ వేస్తూ వీడియోకి చిక్కాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఐపీఎల్‌ సీజన్‌ 16 మరో మూడ్రోజుల్లో మొదలుకాబోతోంది. మార్చి 31నుంచి ప్రారంభంకాబోతున్న ఐపీఎల్‌ కోసం ఆటగాళ్లంతా రెడీ అవుతున్నారు. తమతమ ఫ్రాంచైజీలకు చేరుకొని క్యాంపుల్లో సాధన చేస్తున్నారు. చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీ మాత్రం ప్రాక్టీస్‌ను పక్కనబెట్టి పెయింటర్‌గా మారాడు. చెన్నై చెపాక్‌ స్టేడియంలో కుర్చీలకు పెయింటింగ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు ధోనీ.

హెలికాప్టర్‌ షాట్స్‌తోనే కాదు పెయింటర్‌గానూ అదరగొడతానంటున్నాడు మహేంద్రసింగ్‌ ధోనీ. తనలో ఉన్న ప్రతిభను చాటుకోవడానికి చెన్నై చెపాక్‌ స్టేడియాన్ని ఎంచుకున్నాడు ధోనీ. ఐపీఎల్‌ 16 కోసం ముస్తాబు చేస్తోన్న స్డేడియంలో కుర్చీలకు మెరుగులు పెట్టాడు. కొద్దిసేపు ప్రాక్టీస్‌ను పక్కనబెట్టి కుర్చీలకు పెయింటింగ్‌ చేస్తూ సరదాగా గడిపాడు. గ్లాస్ బ్లోయర్‌ సాయంతో కుర్చీలకు పెయింటింగ్‌ చేశాడు ధోనీ. మొదట పసుపు రంగు కుర్చీలకు, ఆ తర్వాత నీలం రంగు కుర్చీలకు పెయింటింగ్‌చేసి మెరుగులు దిద్దాడు. ప్రొఫెషనల్‌ పెయింటర్‌లాగానే శ్రద్ధగా కలర్స్‌ వేశాడు ధోనీ. మహీ పెయింటింగ్‌ వేస్తుండగా మిగతా చెన్నై ప్లేయర్స్‌ అంతా ఆ సీన్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ధోనీ పెయింటింగ్‌ వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ధోనీ వీడియోకి క్యాప్సన్‌ కూడా ఇచ్చింది చెన్నై సూపర్‌కింగ్స్‌. ఇవి కచ్చితంగా ఎల్లోవే!, ఏప్రిల్‌ థర్డ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామ్‌ అంటూ రాసుకొచ్చింది. ఎందుకంటే, సీజన్‌ 16 మార్చి 31నుంచి ప్రారంభమవుతున్నా… ఏప్రిల్‌ మూడున చెన్నై చెపాక్‌ స్టేడియంలో ఫస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇక, ఈ సీజన్‌తో తన ఐపీఎల్‌ కెరీర్‌కు కూడా ముగింపు ఇవ్వాలనుకుంటున్నాడు ధోనీ.

వైరల్ అవుతున్న ధోనీ వీడియో..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..