Viral Video: హైవేపై బైక్ – కారు రేస్.. మధ్యలో వచ్చిన మరో బైక్.. చివరకు ఏమైందంటే..? వీడియో వైరల్..
హైవేపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే, కొంతమంది దీనిని అర్థం చేసుకోకుండా అతివేగంతో వాహనాలు నడిపి వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను రిస్క్ లో పెడతారు. ఈ వైరల్ వీడియోలో కూడా ఇలాంటిదే కనిపిస్తుంది.

అతి వేగం, నిర్లక్ష్యం పెను ప్రమాదాలకు దారితీస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు గాల్లో కలిసిపోతే, మరికొన్నిసార్లు తీవ్ర గాయాలపాలు చేస్తాయి. వాహనాలను నియంత్రించగల వేగంతోనే నడపాలని నిపుణులు ఎంతగా హెచ్చరించినా, కొంతమంది మాత్రం స్టంట్ల మోజులో ప్రాణాలను పణంగా పెడుతుంటారు. అలాంటి ఘోర ప్రమాదం నుంచి ఓ బైక్ రైడర్ తృటిలో తప్పించుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రమాదం ఎలా జరిగింది?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఓ హైవేపై కారు, బైక్ మధ్య రేసు జరుగుతుంది. బైక్ రైడర్ కారు డ్రైవర్‌ను వేగాన్ని పెంచమని ప్రోత్సహిస్తాడు. కారు వేగం పెంచగానే, బైక్ రైడర్ కూడా తన వేగాన్ని మరింత పెంచుతాడు. అయితే కొంత దూరం వెళ్ళాక, మరో బైక్ అకస్మాత్తుగా అతనికి అడ్డు వస్తుంది. ఆ సమయంలో బైక్ అతి వేగంతో ఉండటం వల్ల ముందున్న బైక్‌ను ఢీకొడతాడు. బైక్‌లు ఒకదానికొకటి ఢీకొనడంతో, బైక్ రైడర్ గాల్లో చాలా దూరం ఎగిరిపడ్డాడు. అదృష్టవశాత్తూ, ప్రాణాపాయం లేకుండా అతను బయటపడ్డాడు.
ఈ షాకింగ్ వీడియోను ఓ యూజర్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘‘హైవేలపై కుక్కలు, పశువులు, ఆటోలు లేదా ఇతర బైక్‌లు ఎప్పుడైనా అకస్మాత్తుగా అడ్డు రావచ్చు. దయచేసి నెమ్మదిగా వెళ్లండి ’’అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ 31-సెకన్ల వీడియోను ఇప్పటివరకు 3.61 లక్షల మందికి పైగా వీక్షించారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇండియన్ రోడ్లపై వేగం కాదు.. అప్రమత్తత అవసరం. ఒక చిన్న పొరపాటు మీ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను తీయగలదంటూ కామెంట్లు చేస్తున్నారు.
On highways, dogs, cattle, battery autorickshaws or bikes can suddenly appear in front of you. Please do not say “Bhaga, aur tez”.
— Deadly Kalesh (@Deadlykalesh) August 29, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
