AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: అనంతపురంలో పది అడుగుల పైథాన్‌.! నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో. అసలు నిజం ఏంటంటే..

Fact Check: స్మార్ట్‌ఫోన్‌ (Smartphone), సోషల్‌ మీడియా (Socila Media) ఈ రెండు సమాచార విప్లవాన్ని పూర్తిగా మార్చేశాయి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలో వాలిపోయేలా చేస్తున్నాయి. ప్రమాదాల నుంచి మొదలు వింతల వరకు...

Fact Check: అనంతపురంలో పది అడుగుల పైథాన్‌.! నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో. అసలు నిజం ఏంటంటే..
Viral Video
Narender Vaitla
|

Updated on: Mar 06, 2022 | 6:15 AM

Share

Fact Check: స్మార్ట్‌ఫోన్‌ (Smartphone), సోషల్‌ మీడియా (Socila Media) ఈ రెండు సమాచార విప్లవాన్ని పూర్తిగా మార్చేశాయి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలో వాలిపోయేలా చేస్తున్నాయి. ప్రమాదాల నుంచి మొదలు వింతల వరకు ప్రతీ విషయాన్ని సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తున్నారు. లైక్‌లు, షేర్‌లతో రోజుకో కొత్త వీడియో సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది. అయితే ఇలా వైరల్ అవుతోన్న వీడియాలు, వార్తలన్నీ నిజమేనా అంటే.. కచ్చితంగా అవునని సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఫోటో షాపింగ్‌ మాయ లేదా తప్పుడు కంటెంట్‌తో నెటిజన్లు కొందరు తప్పు దారి పట్టిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది.

అనంతపురంలో జిల్లా శెట్టురు మండలం మంగంపల్లిలో రోడ్డుపై ఓ భారీ కొండ చిలువ ప్రత్యక్షమైందనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చాలా మంది ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. అనంతపురంలో భారీ పాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో మనం నివసిస్తున్న ప్రాంతంలో ఇంత పెద్ద కొండ చిలువ సంచరించడం ఏంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్త పూర్తిగా ఫేక్‌. వీడియోలో కనిపిస్తున్న పాము నిజమే అయినప్పటికీ అది కనిపించింది మాత్రం అనంతపురంలో కాదు.

అసలు విషయమేంటంటే.. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన సుశాంత్‌ నందా అనే ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ భారీ అనకొండ వీడియోను షేర్‌ చేశారు. ‘మూగ జీవులకు కూడా తమ దారిలో వెళ్లే హక్కు ఉంది. దయ చేసి వారికి దారి నివ్వండి’ అంటూ ఆ వీడియోను షేర్‌ చేశాడు. ఎక్కడో ఉత్తర భారతదేశంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియోలో ఓ పది అడుగుల భారీ అనకొండ రొడ్డును క్రాస్‌ చేసింది. ఈ సమయంలో అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. దీంతో ఈ వీడియో కాస్త సుశాంత్‌ కంటపడడంతో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు అనంతపురంలో పాము అనే పేరుతో వైరల్‌ అవుతోన్న వీడియో ఇదే. కాబట్టి వాట్సాప్‌ గ్రూప్‌లో, ఫేస్‌బుక్‌ పేజీల్లో వైరల్‌ అవుతోన్న వీడియోలను గుడ్డిగా నమ్మి భయాందోళనలకు గురి కాకుండా ఒకటికి రెండు సార్లు ముందు వెనకా ఆలోచించుకుంటే మంచిది.

Also Read: Russia Ukraine Crisis: ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన జైశంకర్, దోవల్

కేంద్ర మంత్రికి లోకేశ్ లేఖ.. ఆదుకోకుండా భారం మోపడం ఏమిటని ప్రశ్న

Darja Movie: యాక్షన్ కింగ్ రిలీజ్ చేసిన సునీల్ సినిమా మోషన్ పోస్టర్..