Viral Video: వింత శబ్దాలతో.. మంచం కింద కదలాడుతున్న నల్లటి ఆకారం.. ఏంటా అని చూడగా గుండె గుభేల్
సాధారణంగా పాములంటేనే భయంతో వణికిపోతుంటాం.. దూరంలో కనిపిస్తేనే పరుగులు తీస్తాం.. అలాంటి ఓ భారీ నాగు పాము ఏకంగా మంచం కిందనే తిష్టవేసింది.. ఆ గదిని కుటుంబసభ్యులు ఖాళీగానే ఉంచారు.. కొంతకాలం తర్వాత ఆ గదిలోకి నుంచి శబ్దాలు వినిపించాయి.. దీంతో ఏంటోనని చూడగా 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా కనిపించింది..

సాధారణంగా పాములంటేనే భయంతో వణికిపోతుంటాం.. దూరంలో కనిపిస్తేనే పరుగులు తీస్తాం.. అలాంటి ఓ భారీ నాగు పాము ఏకంగా మంచం కిందనే తిష్టవేసింది.. ఆ గదిని కుటుంబసభ్యులు ఖాళీగానే ఉంచారు.. కొంతకాలం తర్వాత ఆ గదిలోకి నుంచి శబ్దాలు వినిపించాయి.. దీంతో ఏంటోనని చూడగా 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా కనిపించింది.. దీంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని స్నేక్ క్యాచర్ ను పిలిపించారు. చివరకు దానిని రెస్క్యూ చేసి అడవిలో వదిలిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది..

దక్షిణ కన్నడ జిల్లా ఇందబెట్టులో ఓ ఇంటిలోకి వచ్చిన 12 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రాను రక్షించి అడవిలోకి వదిలారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బంగాడిలోని ఓ ఇంట్లో మంచం కింద గిరినాగు పాము తిష్టవేసింది. అయితే.. ఇంటి యజమాని మొత్తం గదులను ఉపయోగించడంలేదు.. ఇంటికి ఒక వైపు మాత్రమే ఉపయోగించడంతో.. మరో పక్క గదిలో మంచం కింద పెద్ద గిరినాగు తిష్టవేసింది.ఈ క్రమంలో తాజాగా గది తలుపు తీయగానే మంచం కింద శబ్ధం వినిపించింది. మంచం కింద చూసేసరికి ఓ పెద్ద త్రాచుపాము (గిరి నాగు) కనిపించింది.
వీడియో చూడండి..
దీంతో కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్ అశోక్ లైలాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన రెప్టైల్ కీపర్ అశోక్ లైలా భారీ గిరి నాగుపామును పట్టుకుని అడవిలోకి వదిలిపెట్టారు. దీంతో కుటుంబసభ్యులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

King Cobra
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
