AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11కి ‘aivene’, 19 కి ‘ninithin’ ఇంగ్లిషు స్పెల్లింగులట.. సర్కార్‌ బడిలో ఇంగ్లీష్ టీచర్‌ పాండిత్యం చూశారా? వీడియో

దేశంలో విద్యా వ్యవస్థ ఎంతగా భ్రస్టు పట్టిపోయిందో ఈ ఒక్క సంఘటన తెలియజేస్తుంది. లక్షల రూపాయలు జీతంగా చెల్లించి ప్రభుత్వ కొలువు కట్టబెడితే.. ఓ ఇంగ్లిష్ టీచర్ కనీసం పదకొండు అని ఇంగ్లిష్ లో రాయలేకపోయాడు. దీంతో తనిఖీలకు వచ్చిన అధికారులు గుడ్లు తేలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది..

11కి 'aivene', 19 కి 'ninithin' ఇంగ్లిషు స్పెల్లింగులట.. సర్కార్‌ బడిలో ఇంగ్లీష్ టీచర్‌ పాండిత్యం చూశారా? వీడియో
Govt School English Teacher In Chhattisgarh
Srilakshmi C
|

Updated on: Jul 29, 2025 | 6:16 PM

Share

ఛత్తీస్‌గఢ్, జులై 29: ఆయనో ప్రభుత్వ బడిలో టీచర్‌. ఐదేళ్లుగా విద్యార్ధులకు ఇంగ్లిష్‌ పాఠాలు చెబుతున్నాడు. పదకొండు, పంతొమ్మిది అని బోర్డుపై ఇంగ్లీష్‌లో రాయమంటే.. ‘aivene’, ‘ninithin’ అని రాశాడు. ఇంగ్లీషును ప్రాథమిక సబ్జెక్టుగా బోధించే సదరు ఉపాధ్యాయుడు ఆంగ్ల భాషలోని బేసిక్‌ పదాలను కూడా రాయలేకపోతున్నాడు. కనీసం వాటిని ఉచ్చరించలేకపోవడం విడ్డూరంగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దేశంలో ప్రభుత్వ బడుల్లో విద్యా ఎంత నాసిరకంగా ఉందో ఈ ఒక్క వీడియో చూస్తూ తెలిసిపోతుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ప్రభుత్వ బడుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఓ అధికారి ఇంగ్లిష్‌ టీచర్‌ను బ్లాక్‌బోర్డ్‌పై పదకొండు (eleven), పందొమ్మిది (nineteen) అని ఇంగ్లిష్ లో స్పెల్లింగ్ రాయమని అడిగారు. సదరు టీచర్ బోర్డుపై స్పెల్లింగ్‌లను ‘aivene’, ‘ninithin’ రాశాడు. స్పెల్లింగ్‌ నీకు తెలుసా.. అని అధికారి అడగగా.. తనకు ఖచ్చితంగా తెలుసని ఎంతో నమ్మకంగా చెప్పాడు. అయితే మీ ముందు కూర్చున్న విద్యార్ధులకు ఆ స్పెల్లింగ్‌ నేర్పించమని అడిగారు. దీంతో సదరు టీచర్‌ అధికారులతో ఘర్షణకు దిగాడు.

ఇవి కూడా చదవండి

సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్యపై ఆందోళనలు

ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న విద్యకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న విద్య నాణ్యతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు బేసిక్‌ పదాలకు కూడా స్పెల్లింగ్‌ చెప్పలేకపోతే.. అతన్ని ఎలా నియమించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వీడియో విద్యా వ్యవస్థ వైఫల్యంను దుయ్యబడుతోంది. ఇంత జరిగినా.. సదరు ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు వెల్లడికాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.