AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫీస్‌ మీటింగ్‌ మధ్యలో వెళ్లి.. బిల్డింగ్‌ పైనుంచి దూకేసిన టెకీ! అసలేం జరిగిందంటే..

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పని ఒత్తిడి మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆఫీస్ లో జరగుతున్న మీటింగ్ కు హాజరైన ఓ టెకీ.. మీటింగ్ మధ్యలో బయటకు వెళ్లాడు. ఏం జరిగిందో తెలియదుగానీ ఉన్నట్లుండి తమ ఆఫీస్ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హఠాత్ పరిణామానికి అంతా షాకయ్యారు..

ఆఫీస్‌ మీటింగ్‌ మధ్యలో వెళ్లి.. బిల్డింగ్‌ పైనుంచి దూకేసిన టెకీ! అసలేం జరిగిందంటే..
Pune Techie Suicide
Srilakshmi C
|

Updated on: Jul 29, 2025 | 4:49 PM

Share

పుణె, జులై 29: మహారాష్ట్రలోని పుణెలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. సాఫ్టవేర్‌ ఐటీ ఉద్యోగి ఆఫీసులో మీటింగ్‌ జరుగుతుండగా.. మీటింగ్‌ మధ్యలో నుంచి లేచివెళ్లిపోయి అదే ఆఫీస్‌ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం (జులై 28) ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాసిక్‌కు చెందిన పీయూష్‌ అశోక్‌ కవాడే (23) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరగ్ పుణెలోని హింజెవాడి ఐటీ పార్క్‌లోని అట్లాస్ కాప్కో (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది జులై నుంచి అతడు ఇదే కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

సోమవారం ఉదయం ఆఫీసుకు వచ్చిన పీయూష్‌ అశోక్‌ ఆఫీస్‌లో జరుగుతున్న మీటింగ్‌కు హాజరయ్యాడు. అయితే మధ్యలో ఛాతి నొప్పిగా ఉందని చెప్పి మీటింగ్‌ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే ఆఫీస్‌ భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల మధ్య ప్రాంతంలో హింజావాడి ఫేజ్ 2లోని కంపెనీ ప్రాంగణంలో జరిగింది. సంఘటన స్థలంలో ఓ సూసైడ్‌ నోట్‌ కూడా లభ్యమైంది. ‘నేను మంచి కొడుకు అయితే బాగుండేవాడిని. జీవితంలో ప్రతి విషయంలో విఫలమయ్యా. నన్ను క్షమించండి. మీ సమయం వృధా చేసుకోకండి. మీకు కొడుకుగా ఉండే నాకు అర్హత నాకు లేదు అని తల్లిదండ్రులను ఉద్దేశించి అందులో పేర్కొన్నట్లు హింజెవాడి పోలీసు సీనియర్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ పంధారే తెలిపారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. పీయూష్‌ అశోక్‌ మృతికి ఉద్యోగంలో ఒత్తిడి కారణమని, విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ కురాడే అన్నారు. ఈ కేసును ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమోదు చేశారు. ఈ సంఘటన సహోద్యోగులు, స్థానిక నివాసితులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!