Viral: అర్జంట్‌గా వచ్చిందని బాత్రూంలో వెళ్లిన వ్యక్తి.. డోర్ ఓపెన్ చేయగా కళ్లు బైర్లు కమ్మాయ్
ఎప్పుడైనా పామును దగ్గర నుంచి చూస్తేనే అంత దూరం పరిగెడుతాం.. మరి అది మన ఇంట్లోకే వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.. అదే మన బాత్రూమలోకే వస్తే?.. ఊహించడానికే కష్టంగా ఉంది కదూ..! మీరు నమ్మినా నమ్మకపోయినా సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వర్షాకాలంలో ఇంటి ఆరుబయట లేదా కాలువల్లో పాములు అధికంగా సంచరిస్తుండడం చూస్తూనే ఉంటాం. అసలే జోరున కురుస్తున్న వానలకు ఒకవైపు ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు పాముల బెడద ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటుంది. అయితే గుజరాత్ రాష్ట్రం వలసాడ్ జిల్లా వాపీలోని ఓ ఇంటి మరుగుదొడ్డిలో ఏకంగా ఐదు అడుగుల విషపూరిత పాము కలకలం సృష్టించింది. ముక్తానంద్ రోడ్డుకు సమీపంలోని శ్రీరంగ్ సొసైటీలోని ఓ ఇంటిలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకర పరిస్థితులు నెలకొల్పింది. అత్యంత విషపూరితమైన ఇండియన్ స్పెక్టకిల్ కోబ్రా ఏకంగా ఇంట్లోకే ప్రవేశించి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసింది. మొదట ఆ ఇంటి మహిళ ఈ విషపూరిత పామును తొలిసారి గమనించింది. తక్షణమే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జరగబోయే పరిణామాన్ని ఊహించి ధైర్యంగా బయటకు వచ్చి లైఫ్ రెస్క్యూ ఫౌండేషన్‌కు సమాచారం అందించింది.
సమాచారం అందుకున్న వెంటనే ఫౌండేషన్‌కు చెందిన స్వయం సేవకులు ఘటనాస్థలికి చేరుకుని తమకున్న అనుభవంతో ఆ విషపూరిత పామును పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కోబ్రా సుమారు ఐదు అడుగుల పొడవుతో ఉండి, అత్యంత విషపూరితమైన జాతికి చెందినది కావడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్వయం సిబ్బంది తమ నైపుణ్యాన్ని ఉపయోగించి ఎట్టకేలకు పామును బంధించగలిగారు.
ఆ కుటుంబాన్ని పెద్ద ప్రమాదం బారి నుంచి రక్షించారు. లేకపోతే తమ కుటుంబానికి ప్రాణాపాయం తప్పేది కాదని, లైఫ్ రెస్క్యూ ఫౌండేషన్ సభ్యుల వల్ల ఈ రోజు పెద్ద గండం నుంచి బయటపడ్డామని ఆ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఫౌండేషన్ సిబ్బంది పట్టుబడిన కోబ్రాను అటవీ శాఖ అధికారులతో సంప్రదించి, అవసరమైన అనుమతులు తీసుకున్న అనంతరం అడవిలో వదిలేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా ఇంటి మరుగుదొడ్డి వరకు అంత అత్యంత విషపూరితమైన పాము రావడం ఆ కుటుంబాన్ని ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
