AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: కరోనా కోరలు చాస్తోన్న వేళ.. వానరం అంత్యక్రియలకు 1500 మంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

అసలే కరోనా జూలు విదుల్చుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలనే తేడాలేవీ చూపకుండా అందరినీ తన బాధితులుగా మార్చుకుంటోంది. రెండు డోసుల టీకాలు తీసుకున్నా కరోనా నుంచి కాపాడుకోవాలంటే

Viral video: కరోనా కోరలు చాస్తోన్న వేళ.. వానరం అంత్యక్రియలకు 1500 మంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Basha Shek
|

Updated on: Jan 11, 2022 | 8:12 PM

Share

అసలే కరోనా జూలు విదుల్చుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలనే తేడాలేవీ చూపకుండా అందరినీ తన బాధితులుగా మార్చుకుంటోంది. రెండు డోసుల టీకాలు తీసుకున్నా కరోనా నుంచి కాపాడుకోవాలంటే స్వీయరక్షణే ప్రాధాన్యమని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బహిరంగంగా గుమిగూడే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వానరం అంత్యక్రియలకు ఏకంగా 1500 మందికి పైగా హాజరయ్యారు. అందరూ కలిసి ఆ మూగ జంతవుకు దశదిన కర్మ నిర్వహించారు. కాగా కరోనా నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో ఈ తంతు జరగడంతో పోలీసులు కోపోద్రిక్తులయ్యారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించాంరంటూ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో భయపడిన మిగతా వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. . మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజ్‌గఢ్ జిల్లా దలుపురా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గుండు గీయించుకుని.. చందాలు వేసుకుని.. కాగా ఊరివారందరితో చలాకీగా తిరిగే వానరం మృతితో గ్రామస్థులు చలించిపోయారు. అందరూ కలిసి దానికి అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి గుండు గీయించుకోవడం గమనార్హం. అనంతరం అంత్యక్రియల కార్యక్రమానికి ఏకంగా 1500 మంది హాజరయ్యారు. కాగా ఇందుకోసం గ్రామస్థులంతా చందాలు వేసుకున్నారు. కార్డులు ముద్రించి గ్రామమంతా పంచిపెట్టారు. అనంతరం నిర్వహించిన కర్మ విందులో కూడా 1500 మందికి పైగా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనక సంబంధమున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా మిగతావారందరూ అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Coronavirus: ఒమిక్రాన్‌ బారిన పడిన స్టార్‌ హీరో మాజీ భార్య.. ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమైనదంటూ..

Malavika Hegde:వేల కోట్ల అప్పులెదురైనా కుంగిపోలేదు, పారిపోలేదు.. దటీజ్‌ మాళవికా హెగ్డే..

Saina Nehwal: హీరో సిద్ధార్థకు కౌంటరిచ్చిన సైనా తండ్రి.. అతను దేశం కోసం ఏం చేశాడంటూ..