Viral: ఓర్నీ.! నిద్ర బంగారం గానూ.. 12 ఏళ్లుగా ఎన్ని గంటలు నిద్రపోతున్నాడో తెల్సా
పనికి తగ్గట్టుగా నిద్ర ఉండాలన్నది పెద్దల మాట. ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి కచ్చితంగా 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలన్నది నానుడి. కానీ మీకో ఆసక్తికర విషయం చెప్పబోతున్నాం. జపాన్‌లో నివసిస్తున్న ఓ మనిషి ఏకంగా 12 ఏళ్లుగా రోజుకు కేవలం..
పనికి తగ్గట్టుగా నిద్ర ఉండాలన్నది పెద్దల మాట. ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి కచ్చితంగా 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలన్నది నానుడి. కానీ మీకో ఆసక్తికర విషయం చెప్పబోతున్నాం. జపాన్‌లో నివసిస్తున్న ఓ మనిషి ఏకంగా 12 ఏళ్లుగా రోజుకు కేవలం అరగంట మాత్రం నిద్రపోతున్నాడు. అస్సలు నమ్మలేకపోతున్నారా.! అవునండీ ఇది నిజమే.. ఇంకా చెప్పాలంటే.. ఇంత తక్కువ సమయం నిద్రపోతున్నా.. పూర్తి ఆరోగ్యంగా.. అలాగే మరింత ఉత్సాహంగా పని చేస్తున్నాడట. మరి లేట్ చేయకుండా ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా..
జపాన్‌కు చెందిన 40 ఏళ్ల డాయిసుకీ హోరీ తన జీవితకాలాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఇలా తక్కువ సమయం నిద్రపోతున్నట్టు చెప్పుకొచ్చాడు. తక్కువ నిద్రపోతున్నా కూడా.. తనను తాను అన్ని పనులు ఉత్సాహంగా చేయాలని శిక్షణ ఇచ్చుకున్నాడట. తినే ముందు స్పోర్ట్స్ డ్రింక్, లేదా కాఫీ తాగితే నిద్రమత్తు అస్సలు ఉండదట. అన్నేసి గంటలు నిద్రపోవడం కంటే.. కొద్దిసేపైనా నాణ్యమైన నిద్రపోతే.. ఆరోగ్యానికి మేలు కలుగుతుందని వివరించాడు. అంతేకాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుందని చెప్పాడు. తమ గోల్స్‌పై దృష్టిసారించేవారు.. ఈ విధానాన్ని అనుసరించాలన్నాడు.
మరోవైపు అతడు చెప్పేవన్నీ నిజాలని ఓ జపాన్ రియాల్టీ షోలో తేటతెల్లం అయ్యేలా చేశాడు. ఆ షోలో పాల్గొన్న హోరీ రోజుకు కేవలం 26 నిమిషాలు మాత్రం నిద్రపోయాడు. అంత తక్కువ సమయం నిద్రపోయినా.. 6 నుంచి 8 గంటలు నిద్రపోయినవారి మాదిరిగానే ఎంతో ఉత్సాహంగా తన పనిని ప్రారంభించాడు. ఈ విషయాలన్నీ కూడా ఆ టీవీ షో నిర్వాహకులు సైతం వెల్లడించారు. కాగా, తన స్లీపింగ్ పాటర్న్స్‌ను అందరికీ నేర్పించేందుకు జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రెయినింగ్ అసోసియేషన్ అనే సంస్థను ప్రారంభించాడు.