Andhra Pradesh: ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మే 31న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎంపీ అవినాశ్‌కి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ని రద్దు చేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులను ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీకోర్టులో సవాలు చేశారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పులు లోపాలున్నాయని అమె తన పిటీషన్‌లో పేర్కొన్నారు.
అయితే ఇప్పటికే ఎంపీ అవినాశ్‌కి బెయిల్ రావడాన్ని వ్యతిరేకించిన సీబీఐ.. సునీత పిటీషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానంలో తన వాదనలు వినిపించనుంది. ఇంకా సునీత పిటిషన్‌పై బుధవారం సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం ఉంది.
కాగా, వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సీబీఐ విచారణ కొనసాగున్న కాలంలోనే ఆయన తల్లికి గుండెపోటు వచ్చింది. దీంతో తన తల్లి ఆనారోగ్యంతో బాధపడుతున్నందున ఆమె బాగోగులు చూసుకోవడానికి తనకు ముందస్తు బెయిల్ కావాలని తెలంగాణ హైకోర్టుని ఎంపీ అవినాశ్ కోరారు. ఈ మేరకు విచారణ జరిపిన సదరు కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..