
మెదక్ జిల్లా, ఆగస్టు 4: ‘మాయం అయిపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు” అనే పాట అక్షర సత్యం అన్పిస్తుంది ఒకోక్కసారి.. డబ్బు కోసం కొంతమంది ఎంతకైన తెగించేస్తున్నారు.. డబ్బు కోసం ఎవరి ప్రాణాలు అయినా తీయడానికి సైతం వెనుకడడం లేదు.. ఒక్క క్షణం ఆలోచించడంలేదు. ఈ కోవలోకే వచ్చే ఓ ప్రబుద్ధుడు అడిగిన డబ్బు ఇవ్వలేదు అని ఏకంగా కన్నతల్లినే చంపేశాడు..మెదక్ జిల్లా హావేలి ఘనాపూర్ మండలం తొగుట గ్రామంలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే..తొగుట గ్రామానికి చెందిన పుస్తె నర్సమ్మ (40)రోజువారీగా కూలి పనికి వెళ్తుండేది.
అయితే నిన్న కూడా యధావిధిగా కూలి పనులకు వెళ్లి,పని ముగించుకొని రాత్రి ఇంటికి వచ్చింది..ఇంట్లో పనులు చేసుకుంటు ఉండగా తాగడానికి డబ్బులు కావాలి అని తన తల్లిని అడిగాడు చిన్నకొడుకు భాను ప్రసాద్.. అయితే తన దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది తల్లి నర్సమ్మ..నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని, కానీ నువ్వు కావాలనే డబ్బులు ఇవ్వడం లేదు అని తల్లితో వాగ్వాదం చేసాడు భాను ప్రసాద్.. ఈ నేపథ్యంలో తల్లి, కొడుకుల మధ్య మాట మాట పెరిగింది..గొడవ పడుతూ ఆవేశంతో ఊగిపోయి భాను ప్రసాద్ కత్తితో తన తల్లి పై దాడి చేసాడు.
దీనితో తల్లి నర్సమ్మ అక్కడిక్కడే మృతి చెందింది.. మొదటి నుండి భాను ప్రసాద్ ఇంట్లో ఏదో ఒక గొడవ చేస్తూ తన తల్లిని ఇబ్బంది పెట్టేవారు అని చెబుతున్నారు స్థానికులు.. ఇటీవలి కాలంలో మద్యానికి బానిస అయ్యాడు అని, మద్యం కోసం సొంత తల్లిన్నే పొట్టనపెట్టుకున్న ఈ పాపాత్ముడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు గ్రామస్తులు. మరో వైపు విషయం తెలియగానే సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు నర్సమ్మను దాడి చేసి హత్య చేసిన భాను ప్రసాద్ ని అరెస్ట్ చేసారు. ఘనపూర్ పోలీసులు.. నర్సమ్మ మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..