పచ్చని పల్లెల్లో సుపారీ హత్యల నెత్తుటి మరకలు.. ఆస్తి కోసం అన్నను హత్య చేయించిన తమ్ముడు..

నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టుగా వెల్లడించారు. కాగా, మృతుని కుటుంబసభ్యులు మాత్రం..పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పచ్చని పల్లెల్లో సుపారీ హత్యల నెత్తుటి మరకలు.. ఆస్తి కోసం అన్నను హత్య చేయించిన తమ్ముడు..
Own Son Murder (Representative image)

Updated on: Nov 18, 2022 | 8:36 PM

మహా నగరాలకు పరిమితమైన సుపారి హత్యల సంస్కృతి ఇప్పుడు పల్లెలను తాకింది. ఆస్తి కోసం సొంత అన్నను.. సుఫారి గ్యాంగ్ తో హత్య చేయించిన ఘటన కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. అన్నను హత్య చేయించిన తమ్మునితో పాటు.. సుపారి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. ఆనవాళ్లను మృతుడిని మాచారెడ్డి మండలం యేల్పుగొండకు చెందిన నిమ్మ మల్లయ్యగా గుర్తించారు. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కూపీలాగితే భూవివాదం..అన్నాదమ్ముల గొడవే హత్యకు కారణమని తేలింది.

రక్తం పంచుకుపుట్టిన అన్నను కిరాయి హంతకులతో హత్య చేయించాడు తమ్ముడు నర్సింలు. అదీ 80వేల సుపారీ ఇచ్చి మరీ. ఈ కేసును ఛాలెంజింగ్‌గా టేకప్‌ చేసిన పోలీసులు.. సుపారీ గ్యాంగ్‌కుచెక్‌ పెట్టారు. నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టుగా వెల్లడించారు. కాగా, మృతుని కుటుంబసభ్యులు మాత్రం..పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని వాపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వాళ్ల నుంచి తమ కుటుంబానికి హానీ వుందన్నారు. తమకు రక్షణ కల్పించాలన్నారు.

ఆస్తి కోసం అనుబంధాల ఖూనీ కొనసాగుతోంది. మాటతో సద్దుమణిగే గొడవలు మర్డర్లకు దారితీస్తున్నాయి. సొంత అన్నను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన నర్సింలు స్కెచ్‌ జిల్లాలో కలకలం రేపింది. ఇలాంటి కల్చర్‌ కామరెడ్డిలో ఎప్పుడూ చూడలేదని నివ్వెరపోయారు స్థానికులు. నిందితుల్ని కఠినంగా శిక్షించడం సహా మల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి