ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నో చెప్పడంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్యహత్యయత్నం చేసింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ బాటిల్ శానిటైజర్ తాగేసింది. తన చావుకు కారణమైన అందర్నీ వదిలిపెట్టవద్దని యువతి సుసైడ్ నోట్ కూడా రాసింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిరునోముల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సింధు.. రావినూతల గ్రామానికి చెందిన వేణు గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే కులాలు వేరు కావడంతో వేణు పేరెంట్స్ వీరి ప్రేమను ఒప్పుకోలేదు. ఇక వేణు కూడా ప్రేమించి, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి సింధును శారీరికంగా వాడుకున్నాడు. కానీ పెళ్లి విషయంలో మాత్రం పేరెంట్స్ అంగీకరించడం లేదంటూ మొహం చాటేశాడు. దీంతో సింధు పోలీసులకు కంప్లైంట్ చేసింది. అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదని సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చింది. గతంలో రెండు సార్లు సింధు, వేణు ఇంటి ముందు ఆందోళనకు దిగినా కూడా ఆమెకు న్యాయం జరగలేదు. వేణు తల్లిదండ్రులు కూడా తనను పిచ్చిపిచ్చిగా బూతులు తిట్టారని సింధు పేర్కొంది. తనలా ఏ అమ్మాయికి అన్యాయం జరగకూడదని చెబుతూ సింధూ సెల్పీ వీడియో తీసుకుంటూ తీసుకొని శానిటైజర్ తాగింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింధు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: డాక్టర్ల నిర్లక్ష్యం..! ఆ ఇంజెక్షన్‌తో నీలం రంగులోకి చిన్నారి శరీరం.. ఆపై మృతి..