AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad to Vizag: గుడ్ న్యూస్… ఈ హైవే ఎక్కితే హైదరాబాద్‌ TO వైజాగ్‌ 8 గంటలే..

దూరం దగ్గరవుతోంది. ప్రయాణ భారం తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని 2 ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖ మధ్య రోడ్‌ జర్నీ టైమ్‌ తగ్గడమే కాకుండా, దూరం కూడా తగ్గిపోనుంది. ఈ రెండు మహా నగరాలను కలుపుతూ ఓ సరికొత్త గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే వస్తోంది. అది అందుబాటులోకి వస్తే...మీ జర్నీ ఇక జాలీగా సాగిపోతుంది. విజయవాడను టచ్‌ చేయకుండానే విశాఖకు చేరుకోవచ్చు.

Hyderabad to Vizag: గుడ్ న్యూస్...  ఈ హైవే ఎక్కితే హైదరాబాద్‌ TO వైజాగ్‌ 8 గంటలే..
New Highway (Representative image)
Ram Naramaneni
|

Updated on: May 18, 2025 | 7:51 PM

Share

ఆంధ్ర-తెలంగాణను కలుపుతూ కేంద్రం నిర్మిస్తోన్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే 365-BG ప్రారంభానికి సిద్ధమవుతోంది. పచ్చని పొలాల మధ్యలో నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖకు రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లవచ్చు.

సూర్యాపేట నుంచి ఖమ్మం చేరుకోగానే ఈ రహదారి ప్రారంభం అవుతుంది. అది ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వరకు ఉంటుంది. 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేను పచ్చని పొలాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం 31 గ్రామాల్లో 19వందల 96 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని హైదరాబాద్ – విశాఖ మధ్య దూరం తగ్గించేందుకు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే 676 కిలోమీటర్లు, సుమారు 12 గంటలపాటు ప్రయాణించాలి. ప్రధానంగా విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కొత్త రహదారి పూర్తయితే విజయవాడ వెళ్లకుండానే విశాఖకు వెళ్లిపోవచ్చు. సుమారు 125 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. ఏడెనిమిది గంటల్లోనే విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. ఇక ఈ హైవే స్పెషాలిటీస్‌ ఏంటో తెలుసుకుందాం..

రూ. 4,609 కోట్ల వ్యయంతో హైవే నిర్మాణం చేస్తున్నారు.  ఇది 4 లేన్లతో కూడిన రహదారి. 162 కి.మీ. దూరంలో 8 చోట్ల మాత్రమే ఎంట్రీ పాయింట్స్‌ ఉన్నాయి. తెలంగాణలో ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లి.. ఏపీలో తిరువూరు, జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం, దేవరపల్లి వద్ద ఎంట్రీ పాయింట్స్‌ ఉంటాయి. ఏపీ పరిధిలో 4 చోట్ల టోల్‌ప్లాజాలు, విశ్రాంతి కేంద్రాలు ఉంటాయి. 117 అండర్‌పాస్‌లు, 33 కల్వర్టులు, 9 భారీ వంతెనలు మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది.

ఖమ్మం జిల్లా పరిధిలో తల్లంపాడు నుంచి వేంసూరు వరకు 105 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం జరుగుతోంది. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పనుల పురోగతిని పరిశీలించారు. ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులలను ఆదేశించారు. ఇండిపెండెన్స్‌ డేకల్లా ఈ హైవేపై వాహనాలు జోరుగా దూసుకుపోనున్నాయి. భారత్ మాల ఎకనామిక్ కారిడార్ పథకం కింద NH-365BG పేరిట ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రూపుదిద్దుకుంటోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..