Shirisha Case: అంతుపట్టని మిస్టరీగానే శిరీష కేసు.. సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్..

| Edited By: Ravi Kiran

Jun 14, 2023 | 7:45 AM

వికారాబాద్‌ జిల్లాలో శిరీష డెత్‌ మిస్టరీ కలకలం రేపుతోంది. శిరీష అనుమానాస్పద మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. మరోవైపు శిరీష కేసును సుమోటోగా స్వీకరించింది జాతీయ మహిళా కమిషన్‌. శిరీష కాల్‌ డేటా ఆధారంగా కేసును ఛేదించేపనిలో పడ్డారు పోలీసులు...

Shirisha Case: అంతుపట్టని మిస్టరీగానే శిరీష కేసు.. సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్..
Vikarabad Sirisha Death Case
Follow us on

Telangana: అర్థరాత్రి ఇంట్లోనుంచి మాయమైన శిరీష తెల్లారేసరికి నీటికుంటలో శవమై తేలింది. కళ్ళనిండా నెత్తురు.. ఒంటి నిండా గాయాలతో ఉన్న శిరీష మృతి మిస్టరీగా మారింది. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం కాండ్లపూర్‌ గ్రామానికి చెందిన శిరీష ఇంట్లో గొడవపడి అర్థరాత్రి ఇంట్లోనుంచి బయటకు వెళ్ళిందంటున్నారు కుటుంబ సభ్యులు. బయటకు వెళ్ళిన శిరీషను హతమార్చిందెవరు? అన్నది ఇప్పుడు బిగ్‌ క్వశ్చన్‌గా మారింది. అయితే శిరీష కేసును సుమోటోగా స్వీకరించింది  జాతీయ మహిళా కమిషన్‌. శిరీష కాల్‌ డేటా ఆధారంగా కేసును ఛేదించేపనిలో పడ్డారు పోలీసులు.

మరోవైపు శిరీష డెత్‌ మిస్టరీపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. అలాగే శిరీష భౌతిక కాయానికి పోస్ట్ మార్టం కూడా పూర్తయ్యింది. శిరీష బాడీపై క్లూస్ లభించకపోవడంతో కేసు దర్యాప్తు క్లిష్టంగా మారింది. కాండ్లపూర్‌ గ్రామానికి వెళ్ళి..శవం దొరికిన ప్రాంతాన్ని పరిశీలించారు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి. కుటుంబ సభ్యుల వివరాలు అడిగితెలుసుకున్నారు. శిరీష ఇంట్లో జరిగిన గొడవపై ఆరా తీశారు. ఎఫ్ ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు ఎస్పీ.

మృతికి ముందు సెల్ ఫోన్ విషయంలో బావ అనిల్‌తో గొడవ పడిన శిరీష ఇంట్లోనే ఆత్మహత్య ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిపారు ఎస్పీ కోటిరెడ్డి. శిరీషను తండ్రి, అక్క భర్త కొట్టిన విషయం నిజమేనని తేల్చారు. శిరీషది హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు శిరీష ఫోన్ లాక్ అయి ఉండడంతో సైబర్ క్రైం కు పంపారు. ఫోన్లోని పూర్తి డాటా సేకరిస్తున్నారు పోలీసులు. ఫోన్ డాటా, ఎఫ్ ఎస్ఎల్ రిపోర్ట్, సాంకేతిక ఆధారాల ద్వారా కేసును ఛేధించేపనిలో పడ్డారు పోలీసులు. హత్యా.. లేక ఆత్మహత్య అనేది పూర్తి దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామన్నారు. మరోవైపు పోలీసుల అదుపులో ఉన్న శిరీష బావ అనిల్, తండ్రి జంగయ్యను విచారిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..