Telangana: పొలంలో వరినాట్లు వేస్తున్న మహిళలు.. కేసీఆర్‌కు మద్దతుగా మహిళ రైతుల పాటలు..

| Edited By: Surya Kala

Jul 20, 2023 | 3:30 PM

తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొందరు మహిళలు వరినాట్లు వేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వరస కట్టి పాటగా పాడుకుంటున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలైన రైతు బందు, రైతు భీమా, ఉచిత కరెంట్ ఇతర సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ వరినట్లు వేస్తూ పాటలు పాడుతున్నారు.

Telangana: పొలంలో వరినాట్లు వేస్తున్న మహిళలు.. కేసీఆర్‌కు మద్దతుగా మహిళ రైతుల పాటలు..
Cm Kcr
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తుఫాను ప్రభావానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే కొందరు మహిళలు వర్షం వస్తున్న లెక్క చేయకుండా పొలం పనులు చేస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొందరు మహిళలు వరినాట్లు వేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వరస కట్టి పాటగా పాడుకుంటున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలైన రైతు బందు, రైతు భీమా, ఉచిత కరెంట్ ఇతర సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ వరినట్లు వేస్తూ పాటలు పాడుతున్నారు.

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక పరిసర ప్రాతంలో ఉన్న కూడవెళ్లి వాగు కూడా పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజక వర్గంలోని తొగుట, మిరుదొడ్డి, అక్బర్ పేట, దుబ్బాక ప్రాంతాలను కలుపుకోని ప్రవహిస్తుంది. ఈ ప్రాంతంలో జోరుగా నారుమల్లు దున్ని వరి నాట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మిరుదొడ్డి ప్రాంతంలోని మహిళలు ఉత్సాహంగా, ఉల్లాసంగా వర్షం వస్తున్నప్పటికీ టార్పిన్ కవర్లు కప్పుకుని, వరి నాట్లు వేస్తూ ఇలా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇలా పాటల రూపంలో పాడుతున్న మహిళ రైతులను చూస్తూ అందరూ తమ తమ ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సీఎం కేసీఆర్ సాంగ్ వీడియో

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..