AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కారు డిక్కీలో మూట.. ఓపెన్ చేసి చూస్తే అంతా షాక్ అయ్యే సీన్..

కరీంనగర్ - వరంగల్ మధ్య రహదారిపై దారుణం చోటుచేసుకుంది. కారు డిక్కీలో మహిళ మృతదేహాం కలకలం రేపింది. మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు దుండగులు. మూడు రోజుల తర్వాత మహిళ మృతదేహాం బయటపడింది. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులను గుర్తించి విచారణ చేపడుతున్నారు.

Telangana: కారు డిక్కీలో మూట.. ఓపెన్ చేసి చూస్తే అంతా షాక్ అయ్యే సీన్..
Murder
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 21, 2026 | 3:39 PM

Share

కారు డిక్కీలో మహిళ మృతదేహం కలకలం రేపింది. మహిళను అతికిరాతకంగా చంపి మూటకట్టి కారులో వదిలేశాడు ఓ ఉన్మాది.  హత్యకు గురైన మూడు రోజుల తర్వాత ఆ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అసలు ఆ హంతకుడు ఎవరూ..! మృతి చెందిన మహిళా ఎవరూ..! ఎందుకు హత్య చేశారు..! ఎందుకలా మృతదేహాన్ని మూటకట్టి కార్ లో వదిలి వెళ్లారు..! అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ దారుణ సంఘటన కరీంనగర్ – వరంగల్ మధ్య రహదారి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగింది. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో గత మూడు రోజుల నుండి TS 03FF 8094 నెంబర్ గల కారు పార్కింగ్ చేసి ఉంది.. గురువారం సాయంత్రం ఆ కారు నుండి దుర్వాసనతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ కారు నెంబర్ ఆధారంగా ఓనర్ ఎల్కతుర్తికి చెందిన సురేందర్ గా గుర్తించి అతన్ని వెంటనే పిలిపించారు.. ఈ క్రమంలో సురేందర్ కొద్దిరోజుల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వినోద్ కు కారు అద్దెకు ఇచ్చినట్లుగా చెప్పాడు.. అతని వద్ద ఉన్న మరో తాళంతో కారు డిక్కీ ఓపెన్ చేయడంతో అంతా షాక్ అయ్యే సీన్ కనిపించింది. కారు డిక్కీలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమెను చంపి మూటకట్టి కారుతో సహా అక్కడ వదిలేశారు.. గ్రామ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టిన పోలీసులు.. మృతురాలు గోదావరిఖనికి చెందిన మానసగా గుర్తించారు.. ఈ హత్య కరీంనగర్ లో జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. వివాహిత ఎలా హత్యకు గురైంది..! ఎవరు చంపారు..! శవంతో 70 కి.మీ ట్రావెల్ చేసి కారును ఇక్కడికి తీసుకువచ్చి నిర్మాణ ప్రదేశంలో వదిలి వెళ్ళింది ఎవరు..! అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. మానసను కరీంనగర్ లో హత్య చేసి, ఆపై మృతదేహాన్ని మూటకట్టి కార్ లో పెట్టారు. అక్కడే కార్ డిక్కీలో పెట్టి డిస్పోజ్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. మృతురాలి తల్లిదండ్రుల నుండి పిర్యాదు తీసుకుని పోలీసులు విచారస్తున్నారు. ఈ హత్య ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వినోద్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.. కార్యదర్శి పిర్యాదు మేరకు మర్డర్ కేసు ఐపీసీ సెక్షన్లు 302 , 201 కింద నమోదుచేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశామని DCP దారా కవిత తెలిపారు.

Follow Us