AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖమ్మంలో దారుణం.. చికిత్స కోసం వచ్చిన మహిళ కిడ్నాప్.. అత్యాచారం

ఆటోలు నడిపే ఆకతాయిలపై ఉక్కుపాదం మోపుతున్నారు..వారి వివరాలు సేకరించి కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆటో డ్రైవర్లు కూడా ఆ ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. అలాంటి మృగాళ్ల వల్ల ఆటోడ్రైవర్లను అందరినీ అనుమానించే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు.

ఖమ్మంలో దారుణం.. చికిత్స కోసం వచ్చిన మహిళ కిడ్నాప్.. అత్యాచారం
Death
Jyothi Gadda
|

Updated on: May 03, 2023 | 8:17 PM

Share

ఖమ్మంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను అపహరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడో ఆటోడ్రైవర్. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండం రామన్నపేట మండలం రామన్నగుట్ట తండాకు చెందిన లీల అనే మహిళ కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె అత్తతో కలిసి ఏప్రిల్ 27న ఖమ్మం ఆసుపత్రికి బయల్దేరింది. రైలులో ఖమ్మంకు చేరిన లీలా, ఆమె అత్త కలిసి ఆసుపత్రికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. పెద్దావిడను ఏమార్చిన దుండగులు అదే ఆటోలో లీలను కిడ్నాప్‌ చేశారు. ఎంతకీ ఆమె జాడ కన్పించకపోవడంతో బంధువులు పోలీసులను ఆశ్రయించారు.

కానీ, పోలీసులు లీల ఆచూకీ కనిపెట్టేలోపుగానే..దారుణం వెలుగులోకి వచ్చింది. లీలను కిడ్నాప్‌ చేసిన దుండగులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం హస్పిటల్‌ సమీపంలో వదిలి వెళ్లారు. తీవ్రగాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ చనిపోయింది. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ మృతురాలి బంధువులు ఆరోపించారు. ఏప్రిల్ 28వ తేదీన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఇదిలా ఉంటే, ఇలాంటి ఘటనే అటు హన్మకొండ జిల్లాలో సంచలనం రేపింది. ఓ మహిళపై గ్యాంగ్‌ రేప్‌ ఘటన కలకలం రేపింది. భర్తతో గొడవపడి బయటకు వచ్చిన ఆమె.. తిరిగి ఇంటికెళ్లేందుకు అర్ధరాత్రి ఆటో ఎక్కింది. ఒంటరిగా వుందని గమనించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు నిందితులు. ఈ విషయం బయటకు చెప్పుకోలేక కుమిలిపోపోయిన ఆ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ క్రమంలో హనుమకొండ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.. ఆటో నెంబర్ ఆధారంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలి విజ్ఞప్తి మేరకు పోలీసులు ఈ విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా విచారణ చేపట్టారు.. రాకేశ్, సనత్, సతీష్ అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు..ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఇద్దరు ఆటో డ్రైవర్లుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన వరంగల్ తీవ్ర కలకలం రేపింది. పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు ఆకతాయిల తాట తీసే పనిలోపడ్డారు.. స్పెషల్ డ్రైవ్ చేపట్టి హెవీ సౌండ్, బయటకు కనిపించకుండా డేక్రషన్స్ చేసి ఆటోలు నడిపే ఆకతాయిలపై ఉక్కుపాదం మోపుతున్నారు..వారి వివరాలు సేకరించి కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆటో డ్రైవర్లు కూడా ఆ ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. అలాంటి మృగాళ్ల వల్ల ఆటోడ్రైవర్లను అందరినీ అనుమానించే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..