మెట్రో ప్రయాణికులకు ఫుల్లు జోష్‌..! మెట్రో రైలు ముందు డ్యాన్స్‌ చేసిన సిబ్బంది..! ఎక్కడంటే..

అయితే, తాజాగా మెట్రో రైల్లో డ్యాన్స్‌కు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఏకంగా మెట్రో సిబ్బంది చేసిన డ్యాన్స్‌ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. హుషారైన త‌మిళ పాట‌ల‌కు మెట్రో సిబ్బంది స్టైలిష్ మూమెంట్స్‌తో వేసిన స్టెప్పులు నెట్టింట తెగ సంద‌డి చేస్తున్నాయి.

మెట్రో ప్రయాణికులకు ఫుల్లు జోష్‌..! మెట్రో రైలు ముందు డ్యాన్స్‌ చేసిన సిబ్బంది..! ఎక్కడంటే..
Kochi Metro Staff
Follow us
Jyothi Gadda

|

Updated on: May 03, 2023 | 7:53 PM

ఇటీవల గతకొద్ది రోజులుగా మెట్రోలో యువతీ యువకులు చేస్తున్న రీల్స్‌, డ్యాన్స్‌ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాంటి వీడియోల్లో కొందరు చేసే చిత్ర విచిత్ర పనులు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అంతేకాడు, ఆయా వీడియోల్లో తోటి ప్రయాణికులు సిబ్బంది సైతం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కూడా మనం చూశాం. అయితే, తాజాగా మెట్రో రైల్లో డ్యాన్స్‌కు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఏకంగా మెట్రో సిబ్బంది చేసిన డ్యాన్స్‌ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. హుషారైన త‌మిళ పాట‌ల‌కు కొచ్చి మెట్రో సిబ్బంది స్టైలిష్ మూమెంట్స్‌తో వేసిన స్టెప్పులు నెట్టింట తెగ సంద‌డి చేస్తున్నాయి.

ఈ వైరల్ క్లిప్‌ల‌ను కొచ్చి మెట్రో రైల్ అధికారిక పేజ్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. తొలి క్లిప్‌లో కొచ్చి మెట్రోలో ప‌నిచేసే యువ‌తీ, యువ‌కుడు ద‌స‌రా మూవీ నుంచి మైనారు వెట్టి క‌ట్టి సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు. ఈ పాట తెలుగులో కూడా ఉంది. చమ్కీల అంగిలేసి ఓ వదిన, కండ్లకు ఐనబెట్టి ఓ వదిన అనే పాటకు ఈ వీడియోలో మ‌హిళ న‌వ్వులు రువ్వుతుండ‌గా, వ్య‌క్తి క్రేజీ స్టెప్స్ ఆక‌ట్టుకున్నాయి. ఈ వీడియో నెట్టింట షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 31,000కుపైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి

నెటిజన్లు ఈ ట్రెండ్‌ను ఎప్పటికీ మిస్సవొద్దు అంటూ కామెంట్లతో హోరెత్తించారు. కొచ్చి మెట్రో సిబ్బంది ఇలా డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు ఓ మహిళా సిబ్బంది తమిళ చిత్రం ఎనిమీలోని ఓ పాటకు టికెట్ కౌంటర్, మెట్రో మెట్లు ఎక్కి స్టెప్పులేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..