AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో దేవుడా.. తమ్ముడికి రాఖీ కట్టి వస్తుండగా అక్క మరణం.. అసలు ఏం జరిగిందంటే..?

అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. తమ్ముడికి రాఖీ కట్టి వస్తుండగా ఓ మహిళ మరణించింది.  రాఖీల పండగ నాడే ఈ ఘటన జరగడంతో తమ్ముడు బోరున విలపించాడు. ములుగు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..  

Telangana: అయ్యో దేవుడా.. తమ్ముడికి రాఖీ కట్టి వస్తుండగా అక్క మరణం.. అసలు ఏం జరిగిందంటే..?
Woman Dead In Accident
Krishna S
|

Updated on: Aug 09, 2025 | 7:58 PM

Share

రాఖీ.. అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీక. రాఖీ పండుగ వచ్చిందంటే అక్కాచెల్లెల్లు ఎక్కడున్నా అన్నాదమ్ముళ్లను వెతుక్కుంటూ వెళ్తారు. ఒక్క ఏడాది సోదరుడికి రాఖీ కట్టకపోయిన ఎంతో బాధపడతారు. వందల కిలోమీటర్లు దాటి తమ అన్నా లేదా తమ్ముడికి కోసం వస్తుంటారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాఖీల సంబరాలు సంతోషంగా సాగుతున్నాయి. ఆడబిడ్డల రాకతో ఇళ్లన్నీ సందడిగా మారాయి. ఇదే సమయంలో మరికొన్ని ఇండ్లు విషాదంతో నిండిపోయాయి. రాఖీ కోసం వెళ్లి కొంత మంది ప్రమాదాల రూపంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. తమ్ముడికి రాఖీ కట్టి వస్తుండగా ఓ మహిళ మరణించింది.

ములుగు జిల్లా నాంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పద్మ అనే మహిళ తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్లింది. తమ్ముడికి స్పెషల్ రాఖీ కట్టి.. స్వీట్లు తినిపించింది. కుటుంబమంతా కాసేపు సంతోషంగా గడిపింది. ఇంతలో అక్క తిరిగి వెళ్తానని చెప్పింది. తమ్ముడు ఉండాలని కోరినా.. పనులు ఉన్నాయంటూ బయలుదేరింది. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తుండగా నాంపల్లి క్రాస్ రోడ్డు వద్ద బండి అదుపుతప్పింది. దీంతో కిందపడి పద్మ ప్రాణాలు కోల్పోయింది. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ఇప్పటిదాక తమతో సంతోషంగా గడిపిన పద్మ మరణించడం.. పుట్టిల్లుతో పాటు అత్తింట్లో విషాదాన్ని నింపింది. రాఖీ పండుగ రోజే ఈ ప్రమాదం జరగడంతో ఆ తమ్ముడు బోరున విలపించాడు. కాగా పద్మ అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..