AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాత్రంతా తల్లి మృతదేహంపై పడి గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించిన రెండున్నరేళ్ల చిన్నారి..!

రంగారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగారెడ్డిగూడ ఊరి చివర నిర్మానుష ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉన్న తల్లి పక్కన ఓ రెండున్నరేళ్ల చిన్నారి బోరున విలపిస్తూ కనిపించింది. ఎటుచూసినా చీకటి.. ఎంతకీ లేవని తల్లి.. ఏం చేయాలో తెలియక, రాత్రంతా చిన్నారి గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది.

Telangana: రాత్రంతా తల్లి మృతదేహంపై పడి గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించిన రెండున్నరేళ్ల చిన్నారి..!
Woman Brutally Murdered
Balaraju Goud
|

Updated on: Mar 23, 2026 | 8:19 AM

Share

రంగారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగారెడ్డిగూడ ఊరి చివర నిర్మానుష ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉన్న తల్లి పక్కన ఓ రెండున్నరేళ్ల చిన్నారి బోరున విలపిస్తూ కనిపించింది. ఎటుచూసినా చీకటి.. ఎంతకీ లేవని తల్లి.. ఏం చేయాలో తెలియక, రాత్రంతా చిన్నారి గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. తెల్లవారక చిన్నారి ఏడుపులు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ హృదయాలను కదిలించిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం దేవునిపల్లి పరిధిలోని రంగారెడ్డిగూడలో వెలుగు చూసింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.

మృతురాలిని రంగారెడ్డిగూడకు చెందిన శోభ(31)గా పోలీసులు గుర్తించారు. పదేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. మొదట్లో వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే అదే గ్రామానికి చెందిన నర్సింహులుతో శోభకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త రాజుకు తెలియడంతో గొడవలు జరిగి విడిపోయారు. అప్పటి నుంచి నర్సింహులుతో సహజీవనం చేస్తోంది. వీరికి రెండున్నరేళ్ల పాప పుట్టింది. అయితే నెలరోజుల క్రితం శోభ పిల్లలతో కలిసి తన తల్లిగారి ఇంటికి చేరుకుంది.

ఈ క్రమంలోనే శనివారం (మార్చి 21) నర్సింహులు.. శోభ కుమారుడికి సైకిల్‌ కొనిపిస్తానని షాద్‌నగర్‌కు రమ్మన్నాడు. కుమారుడిని వెంట పెట్టుకుని వచ్చిన శోభ.. సాయంత్రం వరకు నర్సింహులు కోసం ఎదురుచూసింది. ఎంతకూ అతను రాకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. కుమారుడిని ఇంట్లో ఉంచి.. కుమార్తెతో కలిసి మళ్లీ కోయిలకొండకు బయలుదేరింది. ఇంతలో ఏం జరిగిందో ఏమోగానీ.. ఆదివారం (మార్చి 22) తెల్లవారుజామున రంగారెడ్డిగూడ శివారులోని ఓ పొలంలో రక్తపు మడుగులో శోభ మృతదేహం కనిపించింది. ఆమె తలపై బండరాయితో మోదిన దుండగులు హతమార్చారు. తల్లితోపాటు రెండున్నరేళ్ల చిన్నారి ఏడుస్తూ ఉండిపోయింది. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న రైతులు రోదిస్తున్న చిన్నారిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శోభ తల్లి కరుణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, ఈ ఘటనపై మరింత వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us