CM KCR: బీజేపీ వ్యూహానికి సీఎం కేసీఆర్ ప్రతివ్యూహం.. పొలిటికల్ హీట్ పెంచిన గులాబీ అధినేత స్ట్రాటెజీ..

| Edited By: Shaik Madar Saheb

Jul 02, 2022 | 2:02 PM

స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులతో, వేలాది మంది కార్యకర్తలతో వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. అదేసమయంలో హైదరాబాద్ నగరం బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ బ్యానర్లు, హోర్డింగ్‌లు, తోరణాలతో నిండిపోయింది.

CM KCR: బీజేపీ వ్యూహానికి సీఎం కేసీఆర్ ప్రతివ్యూహం.. పొలిటికల్ హీట్ పెంచిన గులాబీ అధినేత స్ట్రాటెజీ..
Telangana Cm Kcr
Follow us on

CM KCR Counter To BJP : హైదరాబాద్ వేదికగా ఓవైపు తెలంగాణ, మరోవైపు దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులతో, వేలాది మంది కార్యకర్తలతో వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. అదేసమయంలో హైదరాబాద్ నగరం బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ బ్యానర్లు, హోర్డింగ్‌లు, తోరణాలతో నిండిపోయింది. ఓ రకంగా ఆ రెండు పార్టీల ప్రదర్శనకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. అయితే.. బీజేపీ కార్యవర్గ సభల నేపథ్యంలో టీఆర్ఎస్.. అనుసరిస్తున్న వ్యూహం ప్రస్తుతం రాష్ట్రంతోపాటు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మోడీకి స్వాగతం పలకకుండా కేసీఆర్.. యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడం రాజకీయ వ్యూహంలో భాగమని తెలుస్తోంది. ప్రధాని మోడీ వచ్చిన క్రమంలోనే రాష్ట్రపతి అభ్యర్దిని పిలిపించి మీటింగ్‌ నిర్వహించడంతో కేసీఆర్‌ వ్యూహం ఏంటీ అనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే.. రాష్ట్రపతి అభ్యర్ది ప్రచారం కోసం నిర్వహించిన సభలో కూడా సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ  టార్గెట్ గానే విమర్శలు చేశారు.

ముఖ్యంగా బీజేపీ హంగామాను డైవర్ట్‌ చేయడం, తెలుగు మీడియాలో బీజేపీతోపాటు తాను సమానంగా ఎల్‌వెట్‌ కావడం, బీజేపీ బద్ద వ్యతిరేకంగా ఉన్నాననే సంకేతం ఇవ్వడం లాంటివి కనిపిస్తోంది. ఇంకా బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉందనుకునే వాళ్లకు కండబద్దలు కొట్టినట్లు సంకేతం ఇచ్చారు కేసీఆర్. పీఎం వచ్చిన ప్రొటోకాల్‌ పాటించి తాను వెళ్లకుండా, యశ్వంత్‌ సిన్హాను మాత్రం ఏయిర్‌పోర్ట్‌కు వెళ్లి రిసీవ్‌ చేసుకోవడం వెనుక వ్యూహం ఇదేనని తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌పై బిజెపి చేస్తున్న ప్రచారం ఏకపక్షంగా ప్రజల్లోకి వెళ్లకుండా తాను పోటీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, అది దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడం కేసీఆర్‌ వ్యూహం. ఒకవైపు ప్లెక్సీలు, హోర్డింగ్లతో బిజెపి ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో తిప్పికొట్టడడం ఒక్కచాలదని, కేసీఆర్‌ ఏకంగా అప్పటికప్పుడు రాష్ట్రపతి అభ్యర్ది ప్రచారం పేరుతో బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టడం, తమ మీద ఒక విమర్శ చేస్తే వంద విమర్శలు చేస్తామని సంకేతం ఇవ్వడం కనిపిస్తోంది. మొత్తం మీద సీఎం కేసీఆర్.. మరోసారి దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా నిలిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి