ఇంట్లో నుంచి గెంటేసిన భర్త.. తీసుకున్న వరకట్నం తిరిగి ఇవ్వాలని భార్య నిరసన..

అప్పటినుండి ఇంటి వద్దనే ఉంటున్న కీర్తన తనకు రావలసిన కట్నం కానుకలు తిరిగి ఇవ్వాలని పలుమార్లు పోలీసులను కోరినప్పటికీ వారి నుండి స్పందన లేకపోవడంతో.. బాధితురాలు కీర్తన పరశురాం ఇంటి ముందు బైఠాయించింది. పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం తన డబ్బులు ఇవ్వాలని లేకపోతే పోరాటం కొనసాగిస్తానని అంటోంది బాధితురాలు.

ఇంట్లో నుంచి గెంటేసిన భర్త.. తీసుకున్న వరకట్నం తిరిగి ఇవ్వాలని భార్య నిరసన..
Woman Protests for Return of Gifts

Edited By: TV9 Telugu

Updated on: Jul 18, 2025 | 1:05 PM

వివాహ సమయంలో ఇచ్చిన కట్నాన్ని తిరిగి ఇవ్వాలని ఓ యువతి అత్తగారి ఇంటి ముందు బైఠాయించిన సంఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గ్రామంలో చోటుచేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గ్రామానికి చెందిన గోస్కుల పరుశురాములు ఇంటి ఎదుట కీర్తన అనే యువతీ ధర్నా కి దిగింది. తనకు న్యాయం చేయాలని వారి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసింది. బాధితురాలికి అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం అండగా నిలిచింది.

నాలుగు సంవత్సరాల క్రితం మల్కాపేటకు చెందిన కీర్తనను చిన్న బోనాలకు చెందిన పరుశురాములు వివాహం చేసుకున్నాడు. వివాహమైన వారానికి తనకు భార్య వద్దని ఇంటి నుండి వెళ్లగొట్టి అదనపు కట్నం తేవాలని పుట్టింటికి పంపించాడు. అప్పటినుండి ఇంటి వద్దనే ఉంటున్న కీర్తన తనకు రావలసిన కట్నం కానుకలు తిరిగి ఇవ్వాలని పలుమార్లు పోలీసులను కోరినప్పటికీ వారి నుండి స్పందన లేకపోవడంతో.. బాధితురాలు కీర్తన పరశురాం ఇంటి ముందు బైఠాయించింది. పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం తన డబ్బులు ఇవ్వాలని లేకపోతే పోరాటం కొనసాగిస్తానని బాధితురాలు పేర్కొంది.

కీర్తనకు న్యాయం జరిగేంత వరకు అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం అండగా ఉంటుందని తెలిపారు. ఇచ్చిన వరకట్నం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది..మహిళా సంఘాలు..మద్దతు ప్రకటించాయి..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..