Telangana: లోక్ సభలో ఒక్కసీటు దక్కించుకోని బీఆర్ఎస్.. కేసీఆర్ ఏం చేయనున్నారు..

భారత రాష్ట్ర సమితి చరిత్రలో మొదటిసారిగా పార్లమెంట్లో స్థానం కోల్పోయింది. పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి పార్లమెంట్లో ఒక్క స్థానంతో అయినా ప్రభావాన్ని చాటుతూ వచ్చింది. స్వయంగా కేసీఆర్ కూడా బీఆర్ఎస్ నుంచి ఎంపీగానే 2014 వరకు గెలుపొందారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి కారణమేంటి? రాజకీయ సమీకరణాలతోనే తెలంగాణ సాధ్యమని నమ్మిన కేసీఆర్.. ఉద్యమంతో పాటు ఎన్నికలతో తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. 2001లో పార్టీ ప్రారంభించిన సమయంలో కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్లీ అక్కడి నుంచే గెలుపొందారు.

Telangana: లోక్ సభలో ఒక్కసీటు దక్కించుకోని బీఆర్ఎస్.. కేసీఆర్ ఏం చేయనున్నారు..
Kcr

Edited By: Srikar T

Updated on: Jun 06, 2024 | 8:45 AM

భారత రాష్ట్ర సమితి చరిత్రలో మొదటిసారిగా పార్లమెంట్లో స్థానం కోల్పోయింది. పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి పార్లమెంట్లో ఒక్క స్థానంతో అయినా ప్రభావాన్ని చాటుతూ వచ్చింది. స్వయంగా కేసీఆర్ కూడా బీఆర్ఎస్ నుంచి ఎంపీగానే 2014 వరకు గెలుపొందారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి కారణమేంటి? రాజకీయ సమీకరణాలతోనే తెలంగాణ సాధ్యమని నమ్మిన కేసీఆర్.. ఉద్యమంతో పాటు ఎన్నికలతో తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. 2001లో పార్టీ ప్రారంభించిన సమయంలో కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్లీ అక్కడి నుంచే గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‎తో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ ఐదు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2009లో టిడిపితో కలిసి మహాకూటమిలో భాగస్వామిగా బరిలో ఉండి రెండు స్థానాలు గెలుచుకుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సింగిల్‎గా పోటీ చేసిన కారు పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించింది. 2019లో రెండు స్థానాలను కోల్పోయి తొమ్మిది ఎంపీ సీట్లను గెలిచింది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్‎కు ఒక సీటు కూడా దక్కలేదు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినదానికంటే ఘోర ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించింది. కేవలం సీట్లు కోల్పోవడం మాత్రమే కాదు ఎనిమిది స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి.

అందులో మహబూబ్‎నగర్, చేవెళ్ల, జహీరాబాద్ పార్లమెంటు సీట్లు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు. ఇక మల్కాజ్గిరిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఏడుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ మూడో స్థానానికి పార్టీ పరిమితం అవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేవలం సీట్ల పరంగానే కాదు ఓట్ల పర్సంటేజ్ చూసిన అలాగే ఉంది. 2019 పార్లమెంట్ ఎలక్షన్‎లో 41.29 శాతం ఓట్లు వస్తే.. తాజాగా 16.68 శాతానికి గులాబీ పార్టీ ఓట్లు పడిపోయాయి. ఇంత దారుణ పరాభవానికి కారణాలను అన్వేషిస్తుంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేడర్ అంతా నిరుత్సాహంలో ఉండడం.. ఎంతో కొంత కేసిఆర్ బస్సు యాత్ర ప్రభావాన్ని చూపినా.. అది ఓట్ల రూపంలో మారకపోవడం కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‎కు ఎందుకు ఓటు వేయాలి అనే విషయంలో ఓటర్లు కన్విన్స్ కాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లకుపైగా గెలుపొందిన బీఆర్ఎస్ వెంటనే వచ్చిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 9 సీట్లకే పరిమితమైంది. అంటే జాతీయ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్‎కు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టం అవుతుంది. అందుకోసమే టీఆర్ఎస్‎ను బీఆర్ఎస్‎గా పేరు మార్చి జాతీయస్థాయిలో రాజకీయాలు చేద్దామన్నా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో కేసీఆర్ అన్నీ విరమించుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..