వెదర్ అలెర్ట్: తెలంగాణలో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. ఎల్లుండి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో..

వెదర్ అలెర్ట్: తెలంగాణలో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2020 | 3:48 PM

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. ఎల్లుండి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. 7.6 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. రాగల రెండు రోజుల్లో పశ్చిమ దిశగా రాజస్థాన్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో ఆగస్టు 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.

కాబట్టి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు పడనున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ, జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది వాతావరణ శాఖ.

Read More:

వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. కెమెరా షార్ట్‌కట్‌తో పాటు!

ఖైరతాబాద్‌లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ

బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అర్చకుడి క్రైమ్ కథ.. ప్రేయసి కోసం చంపేసి ఆలయంలోనే పూడ్చాడు