ఖైరతాబాద్‌లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ

హైదరాబాద్ మహానగరంలో వినాయకచవితి పండుగను ఎలా చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఖైరతాబాద్ వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖైరతాబాద్ గణేష్ చాలా ఫేమస్. ఆ భారీ గణనాథున్ని దర్శించుకునేందుకు..

ఖైరతాబాద్‌లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2020 | 1:12 PM

హైదరాబాద్ మహానగరంలో వినాయకచవితి పండుగను ఎలా చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఖైరతాబాద్ వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖైరతాబాద్ గణేష్ చాలా ఫేమస్. ఆ భారీ గణనాథున్ని దర్శించుకునేందుకు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేవారు ప్రజలు. కానీ ఈ సారి అలా లేదు. ఈ మాయదారి కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి ఖైరతాబాద్ గణేష్ భారీ ఎత్తును కూడా కుదించారు. ఈ ఏడాది 27 అడుగులతో ఖైరతాబాద్ గణేషుడు ధన్వంతరి వినాయకుడి రూపంలో ప్రజలకు దర్శనం ఇస్తున్నాడు. గత ఏడాదితో పోల్చితే 38 అడుగులు తగ్గింది విగ్రహ ఆకారం.

ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ దర్మనం కోసం వచ్చే వారికి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ పలు మార్గదర్మకాలు చేసిన సంగతి తెలిసింది. దర్మనం కోసం భక్తులు ఎవరూ రావద్దని.. ఆన్‌లైన్‌లోనే దర్మనం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అయినా కూడా ఖైరతాబాద్ గణేష్ దర్మనం చేసుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు. కరోనా సమయంలో భక్తులను అనుమతి ఇవ్వడం లేదని చెప్తున్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వినాయకుడి దర్మనానికి కదలివస్తున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. దర్మనం చేసుకుని వెంటనే వెళ్లిపోవాలని చెప్తున్నా.. భక్తులు అక్కడే నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీంతో అక్కడ గందరగోళం పరిస్థితి నెలకొన్నది.

Read More:

ఇంకా కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ.. మారని పరిస్థితి

బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్