బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సినిమా షూటింగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా, టీవీ షూటింగులకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పలు మార్గదర్మకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా, టీవీ పరిశ్రమ దేశంలో కీలకమైన రంగాల్లో..

బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2020 | 11:51 AM

సినిమా షూటింగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా, టీవీ షూటింగులకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పలు మార్గదర్మకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా, టీవీ పరిశ్రమ దేశంలో కీలకమైన రంగాల్లో ఒకటి. సినీ, టీవీ వినోద పరిశ్రమ కోవిడ్-19 కారణంగా నిలిచిపోయింది. ఇక నుంచి కొన్ని నిబంధనల మేరకు చిత్రీకరణ జరుపుకోవచ్చు. కెమేరా ముందు నటించేవాళ్లు – నటించే సమయంలో మినహా, మిగతా అందరూ మాస్క్ ధరించాలని వెల్లడించారు మంత్రి జవదేకర్.

కేంద్రం మార్గదర్మకాలు:

– కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగుల్లో పాల్గొనాలి – చిత్రీకరణ ప్రదేశంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి – ఆరోగ్య సేతు యాప్‌ని నటీనటులంతా ఉపయోగించాలి – షూటింగ్ సమయంలో విజిటర్లకు అనుమతి ఇవ్వొద్దు – మేకప్ సిబ్బంది ఖచ్చితంగా పీపీఈ కిట్లను ధరించాలి – తక్కువ సిబ్బందితోనే షూటింగ్ జరిపేలా చర్యలు చేపట్టాలి – పరిశ్రమలో హైరిస్క్ కలిగినవారు మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి – ఫేస్ మాస్కులు, షీల్డులు పని ప్రదేశాలు, షూటింగ్ ప్రదేశాల్లో తప్పనిసరి – వీలైనంత వరకు 6 అడుగుల దూరాన్ని పాటించాలి – తక్కువ సిబ్బందితో చిత్రీకరణ జరిపేలా చర్యలు చేపట్టాలి – స్టూడియోలలో వేర్వేరు యూనిట్లకు వేర్వేరు సమయాలు కేటాయించాలి – ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు వేర్వేరుగా ఉండాలి – సెట్లు, మేకప్ గదులు, వ్యానిటీ వ్యాన్లు, టాయిలెట్లను తరచుగా శానిటైజ్ చేయాలి – తగినన్ని గ్లౌజులు, మాస్కులు, పీపీఈలు అందుబాటులో ఉంచుకోవాలి – షూటింగ్ వస్త్రాలు, విగ్గులు, మేకప్ మెటీరియల్ ఇతరులతో పంచుకోకుండా నియంత్రించాలి – కెమేరాలు, పరికరాలను ఒకరికంటే ఎక్కువ ఉపయోగించే పక్షంలో.. సిబ్బంది కచ్చితంగా గ్లౌజులు ధరించాలి – లేపల్ మైకులను దూరం పెట్టాలి. లేదా వాటి వాడకం వీలైనంతగా తగ్గించాలి – సినిమా థియేటర్ల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లో రద్దీ కాకుండా చర్యలు తీసుకోవాలి – లోపలికి ప్రవేశించే మార్గాల్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి – కోవిడ్-19 జాగ్రత్తలు తెలిపే పోస్టర్లు, సందేశాలు అందుబాటులో ఉంచాలి – థియేటర్లలో సోషల్ డిస్టెన్సింగ్ అమలు చేస్తూ సీటింగ్ ఏర్పాటు చేయాలి – టికెట్ల అమ్మకాల్లో ముట్టుకోవాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్ బుకింగ్స్, ఈ-వాలెట్లు, QR కోడ్ స్కానర్లు వినియోగించాలి – తరచుగా పని ప్రదేశాలను, కామన్ ఏరియాను శానిటైజ్ చేస్తూ ఉండాలి.