Weather Alert: తెలంగాణాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణశాఖ కీలక అప్డేట్

|

Aug 12, 2024 | 7:34 AM

హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అంతేకాదు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తాయని తెలిపింది. మధ్యాహ్నం కొంచెం ఎండగా ఉన్నా.. సాయంత్రం వాతవరణం చల్లబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే గత కొన్ని రోజులుగా హైదరబాద్ లో సాయంత్రం, రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Weather Alert: తెలంగాణాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణశాఖ కీలక అప్డేట్
Rains Alert
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో క్యుములోనింబస్ మేఘాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర మట్టానికి 7.6కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ఆవర్తనంతో రాగల 48గంటల్లో తెలంగాణాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరం భీమ్, మెదక్, ఏం. మల్కాజ్ గిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అంతేకాదు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తాయని తెలిపింది. మధ్యాహ్నం కొంచెం ఎండగా ఉన్నా.. సాయంత్రం వాతవరణం చల్లబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే గత కొన్ని రోజులుగా హైదరబాద్ లో సాయంత్రం, రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

గత మూడు రోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు నిండి నిండు కుండలా మారాయి. చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి.. నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేయగా.. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యాం గేట్లు కూడా ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..