Hyderabad: గ్రేటర్ వాసులకు వాటర్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్..

|

Feb 28, 2024 | 3:38 PM

హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా వాటర్ సప్లై ఫేజ్-1, 2 పంప్ హౌజుల్లో స్లూయిస్ వాల్వ్ రిపేర్లు, కలబ్ గూర్, రాజంపేట్, పటాన్ చెరు సబ్ స్టేషన్లలో ఎలక్ట్రికల్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఈ పనులు గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. దీంతో గురువారం ఈ కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో లో-ప్రెజర్ నీటి సరఫరా, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది.

Hyderabad: గ్రేటర్ వాసులకు వాటర్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్..
Hyderabad Water Board
Follow us on

హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా వాటర్ సప్లై ఫేజ్-1, 2 పంప్ హౌజుల్లో స్లూయిస్ వాల్వ్ రిపేర్లు, కలబ్ గూర్, రాజంపేట్, పటాన్ చెరు సబ్ స్టేషన్లలో ఎలక్ట్రికల్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఈ పనులు గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. దీంతో గురువారం ఈ కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో లో-ప్రెజర్ నీటి సరఫరా, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది.

అంతరాయం కలిగే ప్రాంతాలు..

  • ఓ అండ్ ఎం డివిజన్ – 6 : ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్ (లో వాటర్ ప్రెజర్)
  • ఓ అండ్ ఎం డివిజన్ – 8 : ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్స్
  • ఓ అండ్ ఎం డివిజన్ – 9 : హైదర్ నగర్ రిజర్వాయర్ పరిధిలోని.. కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్యనగర్ కాలనీ, వసంత నగర్.
  • ఓ అండ్ ఎం డివిజన్ -15 : ఆర్.సి పురం. అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, మియాపూర్ తో పాటు మంజీరా ఫేజ్ – 1 లోని ఆన్ లైన్ సప్లైలు.
  • ఓ అండ్ ఎం డివిజన్ – 24 : బీరంగూడ, అమీన్ పుర్, బొల్లారం.

కాబట్టి ఈ ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోగలరని గ్రేటర్ హైదరాబాద్ బోర్టు పబ్లిక్‎ను విజ్ఙప్తి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

 మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..