ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ బిజీబిజీగా గడిపే జిల్లా కలెక్టర్.. పనులన్నీ పక్కనపెట్టి సెలవు రోజున పొలంబాట పట్టారు. భార్యతో కలిసి సాధారణ వ్యవసాయ కూలీల్లా మారి పొలంలో నాట్లు వేశారు. ఆదివారం వేళ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి క్యాంప్ ఆఫీస్‌ను ఆనుకొని ఉన్న ఓ అనే రైతు పొలంలో నాటు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వయంగా వరి నారు పీకి.. పొలంలోకి దిగి నాట్లు వేశారు కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులు. సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులతోపాటు పలు అంశాలను రైతుల్ని అడిగి తెలుసుకున్నారు.
ఇక.. లాభదాయక సాగు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కలెక్టర్ రాహుల్‌రాజ్. రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ.. లాభదాయక సాగు చేసే దిశగా పని చేయాలని అధికారులకు ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..