AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakatiya University: కాకతీయలో గ్యాంగ్ వార్..! 8 మంది జూనియర్, 10 మంది సీనియర్‌ విద్యార్థులపై కేసు నమోదు

వీళ్లు విద్యార్థులా...? వీధి రౌడీలా..? అనే అనుమానం కలిగేలా వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు రెచ్చి పోయారు... సీనియర్ - విద్యార్థుల గ్యాంగ్ వార్ తో ఆ విశ్వవిద్యాలయం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు యూనివర్సిటీలో మళ్లీ ఘర్షణ వేయకుండా ముందస్తుగా మోహరించారు...8 మంది జూనియర్లు, 10 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు..

Kakatiya University: కాకతీయలో గ్యాంగ్ వార్..! 8 మంది జూనియర్, 10 మంది సీనియర్‌ విద్యార్థులపై కేసు నమోదు
Kakatiya University
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Feb 08, 2025 | 8:44 AM

Share

వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు వీధిరౌడీల్లా రెచ్చిపోయారు.. సీనియర్ – జూనియర్ల మధ్య చిలరెగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.. కామన్ మెస్ లో జూనియర్ విద్యార్థులు సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వడంలేదని తన్నుకున్నారు.. ఈ ఘటన చిలికిచిలికి తీవ్ర దుమారానికి దారి తీసింది…కామన్ మెస్ లో సీనియర్లు జూనియర్ల మధ్య ఘర్షణలో పలువు విద్యార్థులకు గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు.. కామన్ మెస్ లో కొంత సేపు యుద్ధ వాతావరణం నెలకొంది.

ఈ గ్యాంగ్ వార్ కామన్ మెస్ లో ఈరోజు మధ్యాహ్నం జరిగింది.. సీనియర్ విద్యార్థులకు జూనియర్ రెస్పెక్ట్ ఇవ్వకుండా కోపంగా చూస్తున్నారని నెపంతో జూనియర్లపై ఓ సీనియర్ విద్యార్థి పాల్పడ్డాడు.. ఈ క్రమంలో జూనియర్ విద్యార్థులు కూడా మేమేం తక్కువ కాదని ప్రతిదాడి చేశారు.. సీనియర్లు – జూనియర్ల మధ్య పరస్పర దాడులతో ఒక్కసారిగా కామన్ మెస్ రణరంగంగా మారింది.. సీనియర్లు – జూనియర్లు పిడుగుద్దులు గుద్దుకొని బీభత్సం సృష్టించారు..

అక్కడినుండి పారిపోవడానికి ప్రయత్నించిన కొంతమంది విద్యార్థులను వెంటపడి మరి కొట్టారు.. గర్ల్స్ హాస్టల్ కి వెళ్లే దారిలో సీనియర్లు- జూనియర్ల మధ్య ఫైటింగ్ తో తీవ్ర భయానక వాతావరణ నెలకొంది.. పరస్పరదాడులో కొంతమంది విద్యార్థులకు తీవ్ర గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు.. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ గొడవకు కారణమైన కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.. కానీ యూనివర్సిటీలో ఘర్షణ వాతావరణం మాత్రం చల్లపడలేదు.. సాయంత్రం మరోసారి ఎదురుపడ్డ ఇరువర్గాలు మళ్ళీ ఘర్షణ పడ్డారు.. కాకతీయ యూనివర్సిటీలో ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు యూనివర్సిటీలో మళ్లీ ఘర్షణ వేయకుండా ముందస్తుగా మోహరించారు…8 మంది జూనియర్లు, 10 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..