Telangana: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి.. జెండా పోల్‌కు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి

| Edited By: Srilakshmi C

Jan 26, 2024 | 11:24 AM

గణతంత్ర దినోత్సవ వేడుకలలో విషాదం చోటు చేసుకుంది. పతాకావిష్కరణ చేస్తుండగా జెండా పైపుకు విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. వారిలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. పరిస్తితి విషమం ఆసుపత్రి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి సీతక్క సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ విషాద సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని దళితవాడలో జరిగింది..

Telangana: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి.. జెండా పోల్‌కు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి
Electric Shock At Republic Celebrations
Follow us on

ములుగు, జనవరి26: గణతంత్ర దినోత్సవ వేడుకలలో విషాదం చోటు చేసుకుంది. పతాకావిష్కరణ చేస్తుండగా జెండా పైపుకు విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. వారిలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. పరిస్తితి విషమం ఆసుపత్రి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి సీతక్క సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ విషాద సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని దళితవాడలో జరిగింది. స్థానిక యువకులకు జెండా ఆవిష్కరణ కోసం ఐరన్ పైప్ తో జెండా కడుతున్నారు. ఈ క్రమంలో ఇనుప పైప్ కు విద్యుత్ వైర్లు తగిలాయి. జెండాకు విద్యుత్ వైర్లు తాకడంతో విజయ్, చక్రి, అజిత్ అనే ముగ్గురు విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలో వారిని వెంటనే ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు.

చికిత్స పొందుతూ అజిత్, విజయ్ అనే ఇద్దరూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న మంత్రి సీతక్క తీవ్ర దిగ్బ్రంతికి లోనయ్యారు.. మృతుల కుటుoబాలను పరామర్శించిన సీతక్క గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.