శ్రావణమాసం తొలి సోమవారం.. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తుల కానుక..!

శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో వెలదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తుల తాకిడితో ఆలయం శివ నామస్మరణతో మారుమోగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. అయితే, మహబూబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ దంపతులు స్వామివారికి

శ్రావణమాసం తొలి సోమవారం..  శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తుల కానుక..!
Palkuriki Somanatha Temple

Edited By: Jyothi Gadda

Updated on: Aug 05, 2024 | 7:42 PM

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో వెలదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తుల తాకిడితో ఆలయం శివ నామస్మరణతో మారుమోగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. అయితే, మహబూబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ దంపతులు స్వామివారికి సుమారు 1 కేజీ 97 గ్రాముల మిశ్రమ వెండి రూ.1,12,000 విలువైన వెండి చిన్న గంగాళం, వెండి చెంబును సమర్పించి మొక్కులు చెల్లించారు. దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..