AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ‘శభాష్‌ పోలీస్’.. అంతా చనిపోయాడకున్నారు.. కానీ, ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు ఏం చేశారంటే..

సమాజంలో పోలీసుల పాత్రను మనం ఎంత వర్ణించినా తక్కువే.. ప్రజా భద్రతను నిర్వహించడం నుంచి ఎల్లప్పుడూ అండగా ఉంటూ.. ప్రజల క్షేమం కోసం పరితపిస్తుంటారు.. అయితే.. తాజాగా.. ఇద్దరూ పోలీసులు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. 'శభాష్‌ పోలీస్' అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.

Watch Video: 'శభాష్‌ పోలీస్'.. అంతా చనిపోయాడకున్నారు.. కానీ, ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు ఏం చేశారంటే..
Mulugu Police CPR
Shaik Madar Saheb
|

Updated on: Aug 05, 2024 | 10:39 AM

Share

సమాజంలో పోలీసుల పాత్రను మనం ఎంత వర్ణించినా తక్కువే.. ప్రజా భద్రతను నిర్వహించడం నుంచి ఎల్లప్పుడూ అండగా ఉంటూ.. ప్రజల క్షేమం కోసం పరితపిస్తుంటారు.. అయితే.. తాజాగా.. ఇద్దరూ పోలీసులు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ‘శభాష్‌ పోలీస్’ అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ ఘటన తెలంగాణలోని ములుగులో చోటుచేసుకుంది. పస్రా ప్రాంతంలో ప్రమాదవశాత్తు గోడ మీద నుంచి పడిపోయిన వ్యక్తికి ఇద్దరు కానిస్టేబుళ్లు.. CPR చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఒకరు ఛాతీపై నొక్కుతుండగా.. మరొకరు నొటితో శ్వాసను అందించారు.

అసలేం జరిగిందంటే..

పస్రాలో లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు గోడ మీద నుండి కింద పడ్డాడు.. దీంతో తలకు తీవ్ర గాయమైంది. స్పృహ కోల్పోవడంతో చనిపోయాడని స్థానికులు వదిలేశారు. అతని దగ్గరకు కూడా వెళ్లలేదు.. అయితే.. ఇది తెలిసి ఆ సమయంలో అక్కడే ఉన్న మధు, మధుకర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు అతని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. కంటిన్యూగా CPR చేయడంతో కాసేపటికి అతను స్ఫృహలోకి వచ్చాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి.. సమయస్ఫూర్తితో CPR చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్‌ను అంతా అభినందిస్తున్నారు.

వీడియో చూడండి..

ఆ సమయంలో కానిస్టేబుల్స్ ఇద్దరూ అక్కడ లేకపోతే.. లక్ష్మణ్ సకాలంలో చికిత్స అందక చనిపోయేవాడని పేర్కొంటున్నారు. ఏదిఏమైనా సమయస్ఫూర్తితో వ్యవహరించి.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడటం పట్ల అందరూ అభినందిస్తున్నారు.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..